Urea: అమెరికా నుంచి యూరియా దిగుమతులు పెంపు

వారం రోజుల్లోనే అమెరికా నుంచి ఎగుమతులు ప్రారంభమవుతాయి. దేశంలోని మంగళూరు పశ్చిమ తీరానికి ఇవి దిగుమతి అవుతాయి. రవాణా చార్జీలు, లోడింగ్‌తో కలిపి టన్నుకు 716 డాలర్లుగా ధర నిర్ణయించారు. అమెరికా నుంచి ఇండియా యూరియా దిగుమతులు గతంలో చాలా తక్కువ ఉండేవి.

Urea: అమెరికా నుంచి యూరియా దిగుమతులు పెంపు

Urea

Urea: అమెరికా నుంచి ఇండియా మొదటిసారిగా భారీ ఎత్తున యూరియా దిగుమతి చేసుకోబోతుంది. ఇంతకుముందు అమెరికా నుంచి ఇండియా దిగుమతి చేసుకునే యూరియా చాలా తక్కువగా ఉండేవి. ఇవి ఇప్పుడు భారీ స్థాయిలో పెరగబోతున్నాయి. త్వరలోనే 47,000 టన్నుల యూరియా న్యూ ఓర్లీన్స్ పోర్ట్ నుంచి ఇండియా దిగుమతి కానుంది.

Major : పవన్ తనయుడిలో ఈ ట్యాలెంట్ చూస్తే ఆశ్చర్యపోతారు.. మేజర్ సాంగ్ కంపోజ్ చేసిన అకిరా..

వారం రోజుల్లోనే అమెరికా నుంచి ఎగుమతులు ప్రారంభమవుతాయి. దేశంలోని మంగళూరు పశ్చిమ తీరానికి ఇవి దిగుమతి అవుతాయి. రవాణా చార్జీలు, లోడింగ్‌తో కలిపి టన్నుకు 716 డాలర్లుగా ధర నిర్ణయించారు. అమెరికా నుంచి ఇండియా యూరియా దిగుమతులు గతంలో చాలా తక్కువ ఉండేవి. కేంద్ర వాణిజ్య శాఖ డాటా ప్రకారం 2019-20లో 1.47 టన్నులు, 2020-21లో 2.19 టన్నులు, 2021-22లో 43.71 టన్నులు మాత్రమే దిగుమతి చేసుకుంది. ఇప్పుడు మాత్రం భారీగా దిగుమతులు పెరగనున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఎరువుల సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ విదేశాల నుంచి 1.65 మిలియన్ టన్నుల యూరియా దిగుమతి చేసుకునేందుకు కాంట్రాక్టులు దక్కించుకుంది.

Vaishnav Tej : త్రివిక్రమ్‌తో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ సినిమా..

రాబోయే నెలల్లో అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి భారీగా యూరియా దిగుమతి అవుతాయి. దిగుమతి చేసుకునే యూరియా ధర టన్నుకు 716-721 డాలర్లుగా ఉంది. 2021-22లో ఇండియా మొత్తం 6.52 బిలియన్ డాలర్ల విలువైన 10.16 మిలియన్ టన్నుల యూరియా దిగుమతి చేసుకుంది. ఇండియా ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశాల్లో చైనా, ఒమన్, యూఏఈ, ఈజిప్ట్, ఉక్రెయిన్, సౌదీ అరేబియా ఉన్నాయి.