Indian Students: భారతీయ విద్యార్థులకు రష్యా బంపర్ ఆఫర్

అక్కడ వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న దాదాపు ఇరవై వేల మందికిపైగా విద్యార్థులు దేశం తిరిగొచ్చారు. అయితే, వీళ్లంతా తిరిగి ఉక్రెయిన్ వెళ్లి చదువుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవు. అలాగే దేశంలోనూ వీళ్ల చదువు గురించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Indian Students: భారతీయ విద్యార్థులకు రష్యా బంపర్ ఆఫర్

Indian Students

Indian Students: ఉక్రెయిన్ యుద్ధం వల్ల నష్టపోతున్న భారతీయ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి రష్యా యూనివర్సిటీలు. తమ దేశంలోని యూనవర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించనున్నాయి. ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులు ఇండియా తిరిగొచ్చిన సంగతి తెలిసిందే.

Boy Suicide: తల్లి పుట్టిన రోజున విష్ చేయనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

అక్కడ వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న దాదాపు ఇరవై వేల మందికిపైగా విద్యార్థులు దేశం తిరిగొచ్చారు. అయితే, వీళ్లంతా తిరిగి ఉక్రెయిన్ వెళ్లి చదువుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవు. అలాగే దేశంలోనూ వీళ్ల చదువు గురించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్ సంక్షోభంలో పడింది. తాజాగా ఢిల్లీలోని రష్యన్ ఎంబసీకి చెందిన డిప్యూటీ చీఫ్ రోమన్ బాబూష్కిన్ మాట్లాడుతూ రష్యన్ యూనివర్సిటీలు భారతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అది కూడా విద్యా సంవత్సరం నష్టపోకుండానే ప్రవేశం కల్పిస్తాయన్నారు.

Bus Accident: ఏపీలో బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి

విద్యార్థుల చదువు ఎక్కడ ఆగిందో.. అక్కడ్నుంచే కోర్సు కంటిన్యూ చేయొచ్చని చెప్పారు. ఇది ఉక్రెయిన్ నుంచి చదువు మధ్యలో వదిలేసి వచ్చిన భారతీయ విద్యార్థులకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే స్కాలర్‌షిప్ ద్వారా చదువుకునే విద్యార్థులను కూడా రష్యన్ యూనివర్సిటీలు అనుమతించనున్నాయి. అయితే, ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యాలో ఫీజులు ఎక్కువగా ఉంటాయి. ఇది విద్యార్థులకు భారంగా మారవచ్చు.