Rowan Atkinson : మిస్ట‌ర్ బీన్ చనిపోయారంటూ తప్పుడు వార్త.. సదరు ఛానెల్‌పై అభిమానుల ఆగ్రహం

హాస్యనటుడు ‘మిస్టర్ బీన్’ ఇక లేరని ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ వార్త ప్రసారం చేసింది. ఇది ఫేక్ న్యూస్ అని తేలడంతో అభిమానులు మండిపడుతున్నారు.

Rowan Atkinson : మిస్ట‌ర్ బీన్ చనిపోయారంటూ తప్పుడు వార్త.. సదరు ఛానెల్‌పై అభిమానుల ఆగ్రహం

Rowan Atkinson

Rowan Atkinson : మిస్ట‌ర్ బీన్.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తన హాస్యంతో ఎంతోమంది అభిమానుల గుండెల్లో నిలిచిన నటుడు. ఈయన అసలు పేరు రోవాన్ అట్కిన్స‌న్‌.. ‘మిస్టర్ బీన్’ అత్యంత ప్రాచ్యుర్యం పొందటంతో ఆయన పేరు ‘మిస్టర్ బీన్’గా పడిపోయింది. అయితే ఇతడి విషయంలో ఓ న్యూస్ ఛానెల్ అత్యుత్సాహం చూపింది. హాస్యనటుడు ‘మిస్టర్ బీన్’ ఇక లేరని ఓ ప్రసిద్ధ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ కథనాలు ప్రసారం చేసింది.

చదవండి : Harbhajan Singh: ముంబైలో ఇల్లు అమ్మేసుకున్న హర్భజన్

ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానులు కలత చెందారు. కొందరు RIP ‘మిస్టర్ బీన్’ అంటూ పోస్టులు చేశారు. అయితే ఇది ఫేక్ న్యూస్ అని తెలియడంతో సదరు ఛానల్ పై అభిమానులు మండిపడుతున్నారు. ఓ వార్త ప్రసారం చేసే సమయంలో నిజానిజాలు తెలుసుకోవాలనే సంగతి తెలియదా అంటూ ఆ ఛానల్ ను ఏకిపారేస్తున్నారు అభిమానులు. అంతర్జాతీయంగా ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన ఫాక్స్ న్యూస్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ‘ఫాక్స్ బ్రేకింగ్ న్యూస్ – మిస్టర్ బీన్ 58 సంవత్సరాల వయస్సులో కారు ప్రమాదంలో మరణించారు అంటూ లింక్‌పై క్లిక్ చేయండి అని పోస్ట్ చేశారు.

చదవండి :  Nandyal : లక్ష విలువ చేసే ఫోన్ కొట్టేసిన స్మార్ట్ దొంగ

ఇది ఫేక్ అని తెలియడంతో ఆ ఛానెల్‌పై మండిపడుతున్నారు నెటిజన్లు. కాగా 2017లో కూడా ఇటువంటి పొరపాటే చేశాయి కొన్ని ఛానెళ్లు.. అప్పట్లో కూడా మిస్ట‌ర్ బీన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా కథనాలు ప్రసారం చేశాయి. ఈ వార్త మిస్ట‌ర్ బీన్ కంట పడటంతో వెంటనే రిప్లై ఇచ్చారు.. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. తనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఇక తాజాగా మరోసారి అంతర్జాతీయ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేయడంతో ఆయన అభిమానులు మండిపడుతున్నారు. కాగా ప్రస్తుతం రోవిన్ అట్కిన్సన్ ప్రముఖ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్‌’లో హిట్లర్ పాత్రను పోషించబోతున్నాడు.