Japan Travel Ban : ఒమిక్రాన్ టెన్షన్..విదేశీ ప్రయాణికులపై జపాన్ నిషేధం

దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసి ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ "ఒమికాన్"వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Japan Travel Ban : ఒమిక్రాన్ టెన్షన్..విదేశీ ప్రయాణికులపై జపాన్ నిషేధం

Japan (1)

Japan Travel Ban : దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసి ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ “ఒమికాన్”వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి నేప‌ధ్యంలో విదేశీ సంద‌ర్శకుల రాక‌పై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు సోమవారం జ‌పాన్ ప్రకటించింది. మంగ‌ళ‌వారం నుంచి ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌ధాని ఫుమియో కిషిద తెలిపారు.

కాగా,గత వారం.. ద‌క్షిణాఫ్రికా స‌హా ఎనిమిది ఇత‌ర దేశాల(ఒమిక్రాన్ ప్రభావిత) నుంచి వ‌చ్చే వారికి ప్ర‌భుత్వ కేంద్రాల్లో ప‌ది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల‌ని జపాన్ నియంత్ర‌ణ‌లు విధించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ నెల ప్రారంభంలో విదేశీ విద్యార్ధులు, కార్మికులు, స్వ‌ల్ప‌కాలిక వాణిజ్య సంద‌ర్శ‌కుల కోసం సరిహ‌ద్దు నియంత్ర‌ణ‌ల‌ను స‌డ‌లించిన జ‌పాన్ తాజాగా సరిహ‌ద్దు నియంత్ర‌ణ‌ల‌ను పున‌రుద్ధ‌రించింది. ఇక, అనేక దేశాలలో ఓమిక్రాన్ వేరియంట్ కనుగొనబడిన తర్వాత చాలా దేశాలు తమ సరిహద్దులను మూసేందుకు రెడీ అయ్యాయి.

ALSO READ Omicron : ఒమిక్రాన్ తో తీవ్ర ముప్పు..ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక