Extra Milk in Japan: పాలు ఎక్కువగా ఉన్నాయి, తాగేయండి: ప్రజలకు జపాన్ ప్రభుత్వ సూచన

జపాన్ దేశ ప్రభుత్వం తమ దేశ పౌరులకు ఈమధ్య ఒక విచిత్ర సూచన చేసింది. అదేంటంటే, దేశంలో పాలు ఎక్కువగా ఉన్నాయి, కావున ప్రజలందరూ క్రమం తప్పకుండ పాలు తాగాలని.

Extra Milk in Japan: పాలు ఎక్కువగా ఉన్నాయి, తాగేయండి: ప్రజలకు జపాన్ ప్రభుత్వ సూచన

Japan

Extra Milk in Japan: జపాన్ దేశ ప్రభుత్వం తమ దేశ పౌరులకు ఈమధ్య ఒక విచిత్ర సూచన చేసింది. అదేంటంటే, దేశంలో పాలు ఎక్కువగా ఉన్నాయి, కావున ప్రజలందరూ క్రమం తప్పకుండ పాలు తాగాలని, రోజు తాగే వారు ఒక కప్పు ఎక్కువగా తాగాలని ఆ సూచన సారాంశం. ఇదేంటి పాలు తాగడం, తాగక పోవడం మనిషి వ్యక్తిగత ఇష్టం కదా? అని అనుకుంటున్నారా. నిజమే, అందుకే జపాన్ ప్రభుత్వం ప్రజలకు కేవలం “సూచన మాత్రమే” చేసింది. అయితే అలా ఎందుకు తాగాలో కూడా వివరిస్తూ అక్కడి అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. దేశంలో పాలు నిల్వలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని, ఉపయోగించకపోతే ఆ పాలు “నేల పాలు” అవుతాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.

Also Read: Bank Holiday Alert!: జనవరి నెలలో మొత్తం 16 బ్యాంకు సెలవులు: ఎప్పుడెప్పుడంటే

అసలు పాలు నిల్వలు ఎందుకు ఎక్కువ అయ్యాయి?. కోవిడ్ -19 సమయంలో జపాన్ ప్రభుత్వం కఠిన లాక్ డౌన్ విధించింది. అయితే ప్రజల కనీస అవసరాలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఆహార ధాన్యాలు సహా ఇతర పోషకాహార పదార్థాలు ఎక్కువగా నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంది. అందులో భాగంగా దేశం నలుమూలల తాత్కాలిక పాల సేకరణ చేపట్టారు. జపాన్ దేశంలో పాఠశాలల్లో చిన్నారులకు పాలు పంపిణీ చేయడం ప్రాధమిక హక్కు. లాక్ డౌన్ ఎంత కాలం ఉంటుందో అంచనా వేయలేని అధికారులు, పాఠశాలలకు పాలు పంపిణీ చేసేందుకు తాత్కాలిక రవాణా వ్యవస్థను బలోపేతం చేసారు. అయితే లాక్ డౌన్ కొనసాగుతుండగా, పాఠశాలలు, ఇతర కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో అప్పటి వరకు సేకరించిన 5000 టన్నుల పాలు(దాదాపు 50 లక్షల లీటర్లు) నిల్వ ఉండిపోయాయి.

Also Read: Corona Update : దేశంలో పెరిగిన కరోనా కేసులు

ఇప్పుడేం చేయాలి?. పాలు అధికంగా నిల్వ ఉండడంతో డిమాండ్ సప్లై సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో దేశంలో డైరీ రంగం కుదేలైయ్యే పరిస్థితి తలెత్తిందని భావించిన అధికారులు, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్వయంగా జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కీషీడా రంగంలోకిదిగి, ప్రజలందరూ క్రమం తప్పకుండా పలు తాగి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇది ఎంతలా మారిందంటే.. ఇటీవల నిర్వహించిన ఒక మీడియా సమావేశం సందర్భంగా ఆదేశ వ్యవసాయ మంత్రి మరియు టోక్యో మేయర్లు కూడా ప్రచార కర్తలుగా మారిపోయి, మీడియా ముఖంగా డబ్బా పాలు తాగారు. డిసెంబర్ 2021 వరకు మాత్రమే పాలు నిల్వకు సమయం ఉండడంతో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు, డైరీశాఖ ఆదేశ ఒలింపిక్ విజేత సవోరి యోషిడాను ప్రచారకర్తగా నియమించింది. పాలు లేక కొన్ని దేశాలు అలమటిస్తుంటే, జపాన్ లో ఇలాంటి పరిస్థితి ఉందంటూ అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది.