Bank Holiday Alert!: జనవరి నెలలో మొత్తం 16 బ్యాంకు సెలవులు: ఎప్పుడెప్పుడంటే

ఆర్బీఐ మార్గదర్శకాలు, పలు రాష్ట్రాల్లో సెలవుల కారణంగా జనవరి నెల మొత్తం మీద కేవలం 16 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి

Bank Holiday Alert!: జనవరి నెలలో మొత్తం 16 బ్యాంకు సెలవులు: ఎప్పుడెప్పుడంటే

Bank Holidays

Bank Holiday Alert!: 2022 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతుండగానే… మొదటి నెలలో బ్యాంకుల పనిదినాలు తగ్గిపోనున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాలు, పలు రాష్ట్రాల్లో సెలవుల కారణంగా జనవరి నెల మొత్తం మీద కేవలం 16 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ప్రభుత్వ రంగ మరియు కొన్ని ప్రైవేటు బ్యాంకులు సైతం సెలవులు ప్రకటించాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ సెలవులు మినహా, దేశ వ్యాప్తంగా బ్యాంకు సెలవులు ఒకే విధంగా ఉంటాయి. రెండో శనివారం, నాలుగో శనివారం, మరియు ఇతర జాతీయ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇవికాక ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మరికొన్ని బ్యాంకు సెలవులు ఉంటాయి. మరి జనవరి 2022లో ఏరోజు బ్యాంకులకు సెలవు ఉందొ తెలుసుకుందాం.

Also Read: Corona Update : దేశంలో పెరిగిన కరోనా కేసులు

జనవరి 1, 2022: నూతన సంవత్సరం సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.(కొన్ని ప్రైవేటు బ్యాంకులు తెరిచే అవకాశం ఉన్నా, లావాదేవీలు జరుగుతాయా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది). ఇక జనవరి 1 శనివారం కాగా తరువాతి ఆదివారం.
జనవరి 4, 2022: లోసూంగ్ (సిక్కిం), జాతీయ సెలవు కాదు
జనవరి 8, 2022: రెండవ శనివారం
జనవరి 11, 2022: మిషనరీ డే (మిజోరం) జాతీయ సెలవు కాదు
జనవరి 12, 2022: స్వామి వివేకానంద పుట్టినరోజు
జనవరి 14, 2022: మకర సంక్రాంతి/పొంగల్ (చాలా వరకు దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే సెలవు) మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లోనూ పండుగ జరుపుకుంటున్నా, బ్యాంకులు పనిచేస్తాయని తెలుస్తుంది.
జనవరి 15, 2022: ఉత్తరాయణ పుణ్యకాల మకర సంక్రాంతి పండుగ/మాఘే సంక్రాంతి/సంక్రాంతి/పొంగల్/తిరువల్లువర్ రోజు (పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు)
జనవరి 18, 2022: తాయ్ పూసం (చెన్నై)
జనవరి 22, 2022: నాల్గవ శనివారం
జనవరి 26, 2022: గణతంత్ర దినోత్సవం, జాతీయ సెలవు
జనవరి 31, 2022: మీ-డ్యామ్-మీ-ఫై (అస్సాం) జాతీయ సెలవు కాదు

పైన పేర్కొన్న బ్యాంకు సెలవులు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం రంగ, ప్రైవేటు బ్యాంకులు సహా విదేశీ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, రీజినల్ బ్యాంకులకు మాత్రమే వర్తిస్తాయి. మరి ఇన్ని సెలవుల్లో మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారో చూసుకుని, ముందుగానే మీ బ్యాంకు పనులను చక్కబెట్టుకోండి.

Also Read: Apple Days Sale : ఆపిల్ ఇయర్ ఎండ్ సేల్.. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు..