Blue Origin Flight : అంతరిక్షంలోకి అమెజాన్ అధినేత.. జెఫ్ బేజోస్ కల నెరవేరబోతోంది..

అమెజాన్ సంస్థ సీఈవో కల నెరవేరబోతోంది. అంతరిక్షంలో ప్రయాణించాలని ఆయన కలలు కనేవారు. తాను..తన సోదరుడితో అంతరిక్షంలో విహరించనున్నట్లు జెఫ్ బేజోస్ స్వయంగా వెల్లడించారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు.

Blue Origin Flight : అంతరిక్షంలోకి అమెజాన్ అధినేత.. జెఫ్ బేజోస్ కల నెరవేరబోతోంది..

Jeff Bezos

Jeff Bezos To Go Into Space : అమెజాన్ సంస్థ సీఈవో కల నెరవేరబోతోంది. అంతరిక్షంలో ప్రయాణించాలని ఆయన కలలు కనేవారు. తాను..తన సోదరుడితో అంతరిక్షంలో విహరించనున్నట్లు జెఫ్ బేజోస్ స్వయంగా వెల్లడించారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. బేజెస్ కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ ఒరిజన్ (Blue Origin) తయారు చేసిన న్యూ షెపర్ట్ రాకెట్ లో సోదరులిద్దరూ..2021, జులై 20వ తేదీన గగనంలో విహరించనున్నారు. అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే..ఆ ఫీలింగ్ అద్బుతంగా ఉంటుందని పోస్టు చేసిన వీడియోలో వెల్లడించారు.

సబ్ ఆర్బిటల్ రాకెట్ సిస్టం న్యూ షెపర్డ్.. జెఫ్ బెజెస్, అతడి సోదరుడు మార్క్ బెజోస్ సహా వ్యోమగాములతో టేకాఫ్ తీసుకోనుంది. భూమితో తన బంధాల్ని మార్చేస్తుందని, నింగికెగరడం ఓ సాహసమేనని అభివర్ణించారు. ఆన్‌లైన్‌లో వేలం వేసి సీటును దక్కించుకున్న వ్యక్తి కూడా ఇందులో ప్రయాణించనున్నాడు. బ్లూ ఒరిజన్ అనేది ఏరో స్పేస్ కంపెనీ. దీనిని 2000లో బెజోస్ స్థాపించిన సంగతి తెలిసిందే. మే 05వ తేదీ నుంచి చివరి సీటును ఆన్ లైన్ లో వేలం పెట్టారు. మే 19వ తేదీన బిడ్డింగ్ ను సీల్ చేశారు. ఈనెల 10వ తేదీన బిడ్డింగ్ తెరవనున్నారు. అత్యధిక బిడ్ విలువ రూ. 2.88 మిలియన్ డాలర్లు.

ఇక రాకెట్ విషయాలకు వస్తే..ఈ రాకెట్ లో ఆరుగురు ప్రయాణించే వీలు ఉంది. సముద్రమట్టం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కర్మన్ లైన్ వరకు రాకెట్ వెళుతుంది. అక్కడ క్యాప్యూల్ నుంచి బూస్టర్ వేరు అవుతుంది. ఈ సమయంలో రాకెట్ లో ఉన్న వారు భూమి ఎలా ఉందో సంపూర్ణంగా చూసే ఛాన్స్ ఉంది. గురుత్వాకరణ శక్తి లేకుండా ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కలుగుతుంది. అనంతరం బూస్టర్, క్యాప్సూల్ లు వేర్వేరుగా ల్యాండ్ అవుతాయి.

Read More : Covid Free India : దేశం కరోనా ఫ్రీ భారత్‌గా మారడం ఖాయం..

 

View this post on Instagram

 

A post shared by Jeff Bezos (@jeffbezos)