Kerala Man: కొవిడ్ లాక్‌డౌన్‌లో విమానం తయారుచేసుకుని యూరప్ ట్రిప్ వేయనున్న కేరళ ఫ్యామిలీ

కొవిడ్ లాక్‌డౌన్‌లో చాలా మంది ఇళ్లకే పరిమితమై సరదాగా కాలం గడిపేస్తే కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. వాళ్ల హాబీలకు పదునుపెట్టి మరింత ఉపయోగకరంగా మార్చుకున్నారు. అలాంటి వాటిల్లో నుంచి కేరళకు చెందిన అశోక్ అలీషెరిల్ తమరక్షన్ సొంత విమానం ప్లాన్.

Kerala Man: కొవిడ్ లాక్‌డౌన్‌లో విమానం తయారుచేసుకుని యూరప్ ట్రిప్ వేయనున్న కేరళ ఫ్యామిలీ

Kerala Man

Kerala Man: కొవిడ్ లాక్‌డౌన్‌లో చాలా మంది ఇళ్లకే పరిమితమై సరదాగా కాలం గడిపేస్తే కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. వాళ్ల హాబీలకు పదునుపెట్టి మరింత ఉపయోగకరంగా మార్చుకున్నారు. అలాంటి వాటిల్లో నుంచి కేరళకు చెందిన అశోక్ అలీషెరిల్ తమరక్షన్ సొంత విమానం ప్లాన్. అలా చేసిన విమానంతో ఏ కొద్దిపాటి దూరమో కాదు.. ఏకంగా ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వేస్తున్నారు.

యూకేలోని బిల్లిరికేలో ఉండే తమరక్షన్ 140వేల యూరోలు వెచ్చించి 1500గంటల్లో యూరప్ మొత్తం ఫ్యామిలీతో కలిసి సొంత ఎయిర్ క్రాఫ్ట్‌లో ట్రిప్ కానివ్వనున్నారు. స్వతహాగా లైసెన్స్ పొందిన పైలట్ తమరక్షన్. రెండేళ్లుగా విమానం తయారుచేసేందుకు ప్లాన్ చేశాడు. దీని కోసం భార్యభర్త ఇద్దరు కలిసి తొలి లాక్‌డౌన్‌ నుంచి డబ్బులు దాచడం మొదలుపెట్టారు.

ఇది కొత్త ఆటబొమ్మలా అనిపించింది. దాంతోపాటు చాలా ఎగ్జైటింగ్ గానూ ఉందని మీడియాతో అంటున్నాడు.

Read Also : కేరళలో విద్యార్థులు వినూత్న నిరసన

వీరిద్దరికి ఆరు సంవత్సరాల తారా, మూడు సంవత్సరాల దియా పిల్లలున్నారు. సాధారణంగానే ఆడపిల్లలు విమానంలోకి ఎక్కడమంటే ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు. అందులో వాళ్లనాన్ననే పైలట్ అన్నప్పుడు పిల్లలు ఇంకా సంతోషంగా ఉన్నారు. నేను కూడా ఇదెప్పుడు జరుగుతుందా అనే ఆతురతతో ఉన్నానని తమరక్షన్ భార్య దూబె అంటున్నారు.