Starbucks CEO: స్టార్‌బక్స్ సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్.. భారత సంతతి వ్యక్తికి మరో అంతర్జాతీయ సంస్థ పగ్గాలు ..

అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు నేతృత్వం వహిస్తున్న భారతీయుల జాబితాలో మరొకరు చేరారు. అమెరికా ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న కాఫీ దిగ్గజ సంస్థ స్టార్‍బక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు.

Starbucks CEO: స్టార్‌బక్స్ సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్.. భారత సంతతి వ్యక్తికి మరో అంతర్జాతీయ సంస్థ పగ్గాలు ..

Starbucks CEO

Starbucks CEO: అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు నేతృత్వం వహిస్తున్న భారతీయుల జాబితాలో మరొకరు చేరారు. అమెరికా ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న కాఫీ దిగ్గజ సంస్థ స్టార్‍బక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. 55ఏళ్ల వయస్సు కలిగిన లక్ష్మణ్ నర్సింహన్ ప్రస్తుతం రెకిట్ బెంకిసర్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ బాధ్యతల నుంచి సెప్టెంబర్ 30న తప్పుకొని, అక్టోబర్ 1 నుంచి స్టార్‌బక్స్ ఇన్ కమింగ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టి ప్రస్తుత సీఈవో హోవార్డ్ షుల్జ్ తో కలిసి పనిచేయనున్నారు.

Wipro CEO Salary: భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకునేది అతనే.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..

అమెరికాకు చెందిన అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న వారిలో భారత సంతతి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వారిలో సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ తో పాటు మరో 10మందికిపైగా భారత్ సంతతికి చెందిన వారు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వారి జాబితాలో లక్ష్మన్ నరసింహన్ చేరారు. ఈ విషయంపై లక్ష్మన్ నరసింహన్ మాట్లాడుతూ.. లండన్ ను వీడటం ఎంతో కష్టమే అయినా నా కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. కంపెనీ తదుపరి దశ వృద్ధికోసం స్టార్ బక్స్ లో హోవర్డ్, బోర్డు, నాయకత్వ బృందంతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని తెలిపారు. అయితే నరసింహన్ కు వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో, సంస్థల తీరును మార్చడంలో ప్రసిద్ధుడనే పేరుంది.

Infosys CEO: ఇన్ఫోసిస్ సీఈఓ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లు

కాలేజ్ ఆఫ్ ఇఫ్ ఇంజనీరింగ్, యూనివర్శిటీ ఆఫ్ పుణేలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన లక్ష్మణ్ నరసింహన్ ఉన్నత విద్యాభాసం అంతా విదేశాల్లోనే సాగింది. జర్మనీలో మాస్టర్స్‌ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలోని లాడర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్నేషనల్‌ స్టడీస్, వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ ది యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత 30ఏళ్ల పాటు అంతర్జాతీయ వినియోగదారు బ్రాండ్లలో ముఖ్య బాధ్యతలు చేపట్టారు. మెకిన్సే అండ్ కంపెనీలో సీనియర్ పార్టనర్ గా, పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గానూ బాధ్యతలు నిర్వహించారు. బ్రూకింగ్స్ ఇన్ స్టిట్యూట్ కు ట్రస్టీగా, కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ లో సభ్యుడిగా, బ్రిటన్ ప్రధాని ఆధ్వర్యంలోని బిల్డ్ బ్యాక్ బెటర్ కౌన్సిల్ లో సభ్యుడిగా, వెరిజాన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో సభ్యుడినూ లక్ష్మణ్ నర్సింహన్ ఉన్నారు.