ఫోన్ కాదు మినీ ల్యాప్ టాప్ : LG న్యూ ప్రోడక్ట్

  • Published By: chvmurthy ,Published On : December 20, 2019 / 04:07 PM IST
ఫోన్ కాదు మినీ ల్యాప్ టాప్ : LG న్యూ ప్రోడక్ట్

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్‌జీ  తన సరికొత్త డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎల్‌జీ జీ8ఎక్స్ థింక్’ పేరుతో డిటాచబుల్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్‌ను భారత మార్కెట్లో లభ్యమవుతోంది. ఇందులో 2.1 అంగుళాల సెకండరీ కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ డిస్‌ప్లే ద్వారా నోటిఫికేషన్లు, తేదీ, సమయం, బ్యాటరీ లైఫ్ వంటి వాటిని చూసుకోవచ్చు. డిటాచబుల్ డిస్‌ప్లేను యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. 

దీనిని అవసరానికి అనుగుణంగా అన్ని కోణాల్లోనూ తిప్పుకోవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే  దీన్ని మినీ ల్యాప్‌టాప్‌లా ఉపయోగించుకోవచ్చు. ఎల్‌జీ జీ8ఎక్స్ థింక్ ధర భారత్‌లో రూ.49,999 . డిసెంబర్ 21,2019  నుంచి దేశంలోని అన్ని రిటైల్ స్టోర్స్ లోనూ ఈ పోను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు.
 
ఎల్‌జీ జీ8ఎక్స్ థింక్ స్పెసిఫికేషన్లు

> ఆండ్రాయిడ్ 9పై ఓఎస్, 
> 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫుల్ విజన్ డిస్‌ప్లే, 
> ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 
> వాటర్ డ్రాప్ ఆకారంలోని నాచ్, 
> క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ఎస్ఓసీ, 
> 6జీబీ ర్యామ్, 
> 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, 
> మైక్రోఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు జీబీని పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి.
 
కెమెరాల విషయానికొస్తే.. 
> 12 ఎంపీ+13 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 
> 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 
> 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 

ఇక, డ్యూయల్ స్క్రీన్‌లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ ఫుల్ విజన్ డిస్‌ప్లే, అదనంగా 2.1 అంగుళాల మోనోక్రొమాటిక్ డిస్‌ప్లే ఉన్నాయి. దీనిని యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు.