Pakisatan: 60 మందికి తండ్రి అయిన ఓ పాకిస్తానీ, నాలుగోసారి పెళ్లికి రెడీ అయ్యాడు

ఈయన ఫ్యామిలీ డాక్టర్ కావడం మరో విశేషం. సొంతింటిలోనే క్లినిక్ నడుపుతున్న ఈయన.. నాలుగో పెళ్లి ప్రయత్నిల్లో బిజీ బిజీగా ఉన్నారట. ఇక ఇంత పెద్ద కుటుంబాన్ని ఒకే దగ్గర పోషిస్తున్నారట. తాజాగా ఈయన 60వ సారి తండ్రి అయ్యారు. ఈ బిడ్డకు హాజీ ఖుషాల్ ఖాన్ అనే పేరు పెట్టాడు. అయితే నాలుగో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారన్న ప్రశ్న ఆయన ముందు వేయగా..

Pakisatan: 60 మందికి తండ్రి అయిన ఓ పాకిస్తానీ, నాలుగోసారి పెళ్లికి రెడీ అయ్యాడు

Man in Pakistan becomes father for the 60th time, says 'I want to marry for 4th time'

Pakisatan: క్రితం ఉగాండాకు చెందిన ఒక వ్యక్తి 12 మంది భార్యలతో 102 మంది పిల్లల్ని కన్నాడన్న వార్త కొద్ది రోజుల హల్ చల్ చేసింది. మరీ ఈ స్థాయిలో కాకపోయినా, పాకిస్తాన్‭కు చెందిన ఒక వ్యక్తి దాదాపు ఇదే దారిలో పయనిస్తున్నట్లు ఉన్నారు. ఇప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకున్న ఆయనకు 60 మంది పిల్లలు ఉన్నారు. వీళ్లు సరిపోనట్లు నాలుగో పెళ్లికి సిద్ధమని ప్రకటించేశాడు. బలూచిస్తాన్ రాజధానిక ఖ్వెట్టాకు చెందిన సర్దార్ జన్ మహమ్మద్ ఖాన్ ఖిల్జీ (50) అనే వ్యక్తికి చెందిన సంగతులివి.

Uttar Pradesh: సుప్రీం కోర్టులో యోగి ప్రభుత్వానికి పెద్ద ఊరట.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

పైగా ఈయన ఫ్యామిలీ డాక్టర్ కావడం మరో విశేషం. సొంతింటిలోనే క్లినిక్ నడుపుతున్న ఈయన.. నాలుగో పెళ్లి ప్రయత్నిల్లో బిజీ బిజీగా ఉన్నారట. ఇక ఇంత పెద్ద కుటుంబాన్ని ఒకే దగ్గర పోషిస్తున్నారట. తాజాగా ఈయన 60వ సారి తండ్రి అయ్యారు. ఈ బిడ్డకు హాజీ ఖుషాల్ ఖాన్ అనే పేరు పెట్టాడు. అయితే నాలుగో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారన్న ప్రశ్న ఆయన ముందు వేయగా.. తనకు మగ సంతానం కంటే ఆడ సంతానం చాలా ఇష్టమని, మరింత ఎక్కువ మంది ఆడపిల్లల్ని కనడానికే నాలుగో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

Vande Bharat Express: వందే భారత్ రైలు ప్రమాదంపై ప్రశ్నించగా, భిన్న రీతిలో స్పందించిన మమతా బెనర్జీ

భవిష్యత్తులో జరిగే పెళ్లి, మరింత మంది పిల్లలు కలిగినప్పటికీ వారంతా ఒకే ఇంటిలో ఉండాలనేది తన అభిలాష అని, అదే విధంగా ఉంటామని సర్దార్ జన్ చెప్పుకొచ్చాడు. నాల్గవ పెళ్లి కోసం తన స్నేహితులను, కుటుంబ సభ్యులను సాయం కోరిన ఆయన.. ఇప్పటికే పెళ్లైన తన ముగ్గురు భార్యలు మరింత మంది పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించడం గమనార్హం.