అందరూ సేఫ్.. నేనూ బతికే ఉన్నాను: జైషే చీఫ్ మసూద్

జైషే-ఈ-మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బతికే ఉన్నాడని, ఐఎఎఫ్ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు ఎవరూ చనిపోలేదని. ఎలాంటి నష్టం జరుగలేదని జైషే సంస్థ వెల్లడించింది. మసూద్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అంటూ జేఏఈ కొట్టిపారేసింది

  • Published By: sreehari ,Published On : March 16, 2019 / 01:43 PM IST
అందరూ సేఫ్.. నేనూ బతికే ఉన్నాను: జైషే చీఫ్ మసూద్

జైషే-ఈ-మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బతికే ఉన్నాడని, ఐఎఎఫ్ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు ఎవరూ చనిపోలేదని. ఎలాంటి నష్టం జరుగలేదని జైషే సంస్థ వెల్లడించింది. మసూద్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అంటూ జేఏఈ కొట్టిపారేసింది

జైషే-ఈ-మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బతికే ఉన్నాడని, ఐఎఎఫ్ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు ఎవరూ చనిపోలేదని. ఎలాంటి నష్టం జరుగలేదని జైషే సంస్థ వెల్లడించింది. మసూద్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అంటూ జేఏఈ కొట్టిపారేసింది. మసూద్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన కిడ్నీ, లివర్ ఫర్ ఫెక్ట్ గా పనిచేస్తున్నాయని తెలిపింది. జైషే అనుబంధ వార్తా సంస్థ ఆల్ ఖాలం లేటెస్ట్ వీక్లీ ఎడిషన్ లో సాధీ అనే కలం పేరుతో ఈ వార్త కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో అజహర్.. తన సపోర్టర్లు అందరూ బాగానే ఉన్నారని, ఇండియా చెబుతున్నట్టుగా ఎవరికి ఎలాంటి ప్రాణహని జరుగలేదని చెప్పినట్టు ప్రచురించింది. అప్ఘానిస్థాన్ లోని ప్రస్తుత పరిస్థితులపై కూడా అజహర్ ప్రస్తావించినట్టు తరువాతి కాలమ్ లో పేర్కొంది.  

పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఐఎఎఫ్ వైమానిక దళం పాక్ భూభాగాల్లో దాడుల అనంతరం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.. అజహర్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ప్రకటించింది. పాక్ ఆర్మీ ఆస్పత్రిలో అజహర్ చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. ఐఎఎఫ్ దాడుల్లో బాలాకోట్ ఉగ్రస్థావరాల్లో తలదాచుకున్న అజహర్ చనిపోయినట్టు వార్తలు వినిపించాయి. దీంతో జైషే వెంటనే టెర్రర్ కమాండర్ అజహర్ బతికే ఉన్నాడంటూ ప్రకటించింది. ఇండియా జరిపిన వైమానిక దాడుల్లో పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగా, దాదాపు 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు వెల్లడించింది.