Avoid Social Media : కన్న కొడుక్కి తల్లి ఛాలెంజ్.. ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు దూరం, తర్వాత

నిత్యం సోషల్ మీడియాను వాడుతూ అతుక్కపోయాడు. దీనిని తల్లి గమనించింది. అలా చేయవద్దు.. దూరంగా ఉండాలంటూ చెప్పింది. కానీ.. తల్లి చెప్పిన మాటలను అతను వినిపించుకోలేదు. చివరకు ఓ ఐడియా...

Avoid Social Media : కన్న కొడుక్కి తల్లి ఛాలెంజ్.. ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు దూరం, తర్వాత

Social Media

Mom In Challenge : కన్న కొడుక్కి ఓ తల్లి ఛాలెంజ్ విసిరింది. ఈ ఛాలెంజ్ లో నెగ్గితే.. రూ. 1,800 డాలర్లు ఇస్తానని వెల్లడించింది. దీంతో భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఒప్పేసుకున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఆరేళ్ల పాటు కఠినంగా ఉంటూ.. ఛాలెంజ్ లో గెలుపొందాడు. ఇంతకు ఆ తల్లి ఏ ఛాలెంజ్ విసిరిందో తెలుసా ? సోషల్ మీడియాకు దూరంగా ఉండమని చెప్పింది. ఇలాంటి ఐడియా ఏ తల్లికి రాదని, వచ్చినా… అన్ని ఏండ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండడం హాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

Read More : Russia-Ukraine War : యూకే గగనతలం నుంచి అన్ని విమానాలపై రష్యా నిషేధం

మిన్నెసోటాలో తల్లి లోర్నా గోల్డ్ స్ట్రాండ్ 12 ఏళ్ల పిల్లగాడు సివెర్ట్ క్లెఫ్ సాస్ తో నివాసం ఉంటున్నారు. అయితే.. సీవెర్ట్ సెల్ ఫోన్ విపరీతంగా వాడేవాడు. నిత్యం సోషల్ మీడియాను వాడుతూ అతుక్కపోయాడు. దీనిని తల్లి గమనించింది. అలా చేయవద్దు.. దూరంగా ఉండాలంటూ చెప్పింది. కానీ.. తల్లి చెప్పిన మాటలను అతను వినిపించుకోలేదు. చివరకు ఓ ఐడియా వచ్చింది. కొడుక్కి ఓ ఛాలెంజ్ విసిరింది. ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు గనుక దూరంగా ఉంటే.. 18వ పుట్టిన రోజున 1,800 డాలర్లు (భారత కరెన్సీలో లక్షా 36 వేల రూపాయలు) ఇస్తానని ఛాలెంజ్ విసిరింది. ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. ఆరేళ్లు గడిచిపోయాయి. అన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. రీసెంట్ గా 18వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఛాలెంజ్ ప్రకారం రూ. 1800 డాలర్లు కొడుక్కి ఇచ్చింది. కొడుకు ఫొటోను ఫేస్ బుక్ లో షేర్ చేసింది. సోషల్ మీడియాకు బానిస కావొద్దని సూచించింది.