Monkeypox: చెలరేగిపోతున్న మంకీపాక్స్.. హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన యూఎస్

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మంకీపాక్స్ కేసులు అల్లకల్లోల్లాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు హెల్త్ సెక్రటరీ గురువారం వెల్లడించారు. వైరస్ ను ఎదుర్కోవడానికి అదనపు నిధులు, పరికరాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

Monkeypox: చెలరేగిపోతున్న మంకీపాక్స్.. హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన యూఎస్

Monkeypox

 

Monkeypox: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మంకీపాక్స్ కేసులు అల్లకల్లోల్లాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు హెల్త్ సెక్రటరీ గురువారం వెల్లడించారు. వైరస్ ను ఎదుర్కోవడానికి అదనపు నిధులు, పరికరాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

బుధవారానికి 6వేల 600వరకూ చేరిన కేసుల సంఖ్యలో చాలా వరకూ పురుషులు స్వలింగ సంపర్కం చేసిన వారే ఎక్కువగా ఉన్నారు.

“వైరస్ ను ఎదుర్కోవడానికి మరో అడుగు ముందుకేస్తున్నాం. ప్రతి అమెరికన్ మంకీపాక్స్ ను సీరియస్ గా తీసుకోవాలి” అని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ జేవియర్ బెకెరా పేర్కొన్నారు. ఈ డిక్లరేషన్ కు అనుగుణంగా మంకీపాక్స్ ఇన్ఫెక్షన్లను బట్టి రెస్పాన్స్ ఉండాలని పిలుపునిచ్చారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరక్టర్ రోచెల్లె వాలెన్‌స్కీ మీడియా ముందు వెల్లడించారు.

Read Also: మంకీపాక్స్ వ్యాప్తి నివారణకు ఈ జాగ్రత్తలు పాటించండి.. కేంద్రం కీలక సూచనలు

ఈ వైరస్ ను ఎదుర్కోవడంలో అమెరికా ప్రభుత్వంపై క్రమంగా ఒత్తిడి పెరుగుతుంది. అమెరికా కంటే ముందు ఇది యూరప్ దేశాల్లో ఎక్కువగా కనిపించింది. సెక్సువల్ హెల్త్ క్లినిక్స్‌లో వ్యాక్సిన్లు, ట్రీట్మెంట్ల కొరత దీనికి కారణమవుతుందని పేర్కొన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను “అంతర్జాతీయ ఆందోళనకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ”గా ప్రకటించింది. గత నెలలో WHO ప్రకటన సమన్వయంతో కూడిన అంతర్జాతీయ ప్రతిస్పందనను ప్రేరేపించడానికి టీకాలు చికిత్సలపై సహకరించడానికి నిధులను అన్‌లాక్ చేయడానికి ప్రయత్నించింది.

ప్రభుత్వాలు మశూచికి మొదట ఆమోదించబడిన టీకాలు, చికిత్సలను అమలు చేస్తున్నాయి. 1.6 మిలియన్లకు పైగా హైరిస్క్ వ్యక్తులకు టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వాలెన్స్కీ చెప్పారు.