కలుపు మందు కారణంగా క్యాన్సర్: కంపెనీకి రూ.14 వేల కోట్ల జరిమానా

  • Published By: vamsi ,Published On : May 15, 2019 / 03:51 AM IST
కలుపు మందు కారణంగా క్యాన్సర్: కంపెనీకి రూ.14 వేల కోట్ల జరిమానా

బేయర్‌కు చెందిన మోన్‌శాంటో అగ్రీ కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోన్‌శాంటో అగ్రీ కంపెనీకి చెందిన ‘రౌండప్‌’ కలుపు మొక్కల నివారణి మందు కారణంగా తమకు క్యాన్సర్‌ వచ్చిందంటూ ఓ జంట వేసిన దావా విషయంలో కోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది. ఆ జంటకు రూ.14 వేల కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ ఆక్లాండ్‌లోని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది.  

గ్లైఫోసేట్‌ ఆధారిత తమ ఉత్పత్తికి, క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ చెబుతున్నప్పటికీ వారి వాదనతో ఏకీభవించని కోర్టు వారికి జరిమానా విధించింది. ఈ తీర్పు చారిత్రాత్మకం అని అక్కడి న్యాయవాదులు చెబుతుండగా.. దీనిపై కోర్టుకు పైకోర్టుకు వెళ్తామని బేయర్ వెల్లడించింది.
Also Read : ఔషధాల మెండు : ‘పండు’ దెబ్బకు యూనివర్శిటీ ఖాళీ