Omicron Tension: బాబోయ్ ‘ఒమిక్రాన్‌’..దక్షిణాఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ లో ఉండాల్సిందే : ముంబై మేయర్

దక్షిణాఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ లో ఉండాలని ముంబై మేయర్ కిశోరీ పేడ్నేకర్‌ ప్రకటించారు. ఆఫ్రికా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ టెన్షన్ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Omicron Tension: బాబోయ్ ‘ఒమిక్రాన్‌’..దక్షిణాఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ లో ఉండాల్సిందే : ముంబై మేయర్

Omicron Strain Tension

Omicron strain Tension : కరోనా మహా కంత్రీ వైరస్ లా తయారైంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ గా రూపాంతరం చెంది..‘ఒమిక్రాన్‌’గా మారి ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో ఇప్పుడిప్పుడే భారత్ కరోనా నుంచి కోలుకుంటోందని ఇప్పుడు ఒమ్మిక్రాన్ ఆందోళన కలుగుతున్న క్రమంలో ఆఫిక్రా దేశాల నుంచి వచ్చే విమాన సర్వీసుల్ని నిలిపివేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీని కోరారు.

ఈక్రమంలో ఇప్పటికే ఇజ్రాయెల్‌, బెల్జియం, బోట్స్‌వానా తదితర దేశాలకు ఈ ఒమిక్రాన్ వ్యాపించటంతో అక్కడినుంచి రాకపోకలపై బ్రిటన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడ ఈ విషయమై అప్రమత్తమైంది. దీంట్లో భాగంగానే దక్షిణాఫ్రికా నుంచి ముంబయి విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు క్వారంటైన్‌ నిబంధన విధిస్తున్నామని ముంబై నగర మేయర్ కిశోరీ పేడ్నేకర్‌ శనివారం (నవంబర్ 27,2021) ప్రకటించారు. వారికి పరీక్షలు నిర్వహించి.. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే సంబంధిత ప్రయాణికుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పంపుతామని తెలిపారు.

Read more : Omicron Name : కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ పేరు వెనుక..చైనా అధ్యక్షుడు పేరులో ‘ Xi ’కథాకమామీషు..

గత అనుభవాలతో ముందస్తు జాగ్రత్తలు..
గతంలో కూడా అంతర్జాతీయ విమాన సర్వీసుల వల్లనే భారత్ లోకి కరోనా ప్రవేశించింది. ఇప్పుడు కూడా అలా జరుగుతుందని అధికారులు ముందుస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. కరోనా ‘మహమ్మారి కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ విషయంలో ముంబయిలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారిస్తామనీ..ఇక్కడినుంచి వెళ్లే విమానాలపై మాత్రం ఎటువంటి ఆంక్షలు లేవని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని మేయర్ స్పష్టంచేశారు.

Read more : Omicron: “ఒమిక్రాన్”.. డెల్టాను మించిన డేంజర్ వేరియంట్‌కు పేరు పెట్టిన WHO

అలాగే కరోనా నిబంధనలు కొనసాగుతాయని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించటంతో పాటు సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఒమిక్రాన్ ఆందోళన క్రమంలో ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్ష కోసం ఉన్నతాధికారులతో భేటీ అయిన విషయం తెలిసిందే.