Omicron: “ఒమిక్రాన్”.. డెల్టాను మించిన డేంజర్ వేరియంట్‌కు పేరు పెట్టిన WHO

ఒమిక్రాన్ వేరియంట్ పై అధ్యయనం చేసి.. పరిశోధనలు పూర్తిచేసేందుకు తమకు మరికొన్ని వారాల సమయం పడుతుందని WHO తెలిపింది.

Omicron: “ఒమిక్రాన్”.. డెల్టాను మించిన డేంజర్ వేరియంట్‌కు పేరు పెట్టిన WHO

Omicron

Omicron : ప్రపంచానికి రెండేళ్లుగా దడ పుట్టిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ B.1.1.529కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization)పేరు పెట్టింది. నవంబర్ 26, 2021నాడు జెనీవాలో జరిగిన మీటింగ్ లో దీనికి నామకరణం చేసింది. తొలిసారిగా ఈ వైరస్ వేరియంట్ సౌతాఫ్రికాలో ఓ పేషెంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ లో బయటపడినట్టుగా చెబుతున్నారు. దీని స్పైక్ ప్రొటీన్ లో 32 మ్యుటేషన్లు ఉన్నట్టుగా పరిశోధనల్లో గుర్తించారు సైంటిస్టులు. దీని విషయంలో ప్రపంచదేశాలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించిన WHO… పలు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ కు ఒమిక్రాన్(Omicron) అని పేరు పెట్టింది.

Read This : Coronavirus Lockdown : లాక్ డౌన్ ల కాలం వచ్చేసింది..కరోనా ఫిఫ్త్ వేవ్ భయంతో ఆ దేశంలో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్

డెల్టా కంటే డేంజరస్ వేరియంట్

కోవిడ్ 19 వ్యాధి కారకాల్లో ఒకటైన డెల్టా వేరియంట్ తో పోల్చితే… ఇది మరింత ఇబ్బందిపెట్టగల మ్యుటేషన్ అవుతుందన్న ఆందోళనను WHO వ్యక్తంచేసింది. ఆల్ఫా, బీటా, గామా వేరియంట్ల కంటే.. డెల్టా వేరియంట్ భారత్ సహా.. పలు దేశాల్లో ఎలాంటి మరణ మృదంగం మోగించిందో ఇప్పటికే ప్రపంచం చూసింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతానికి కరోనా ప్రొటోకాల్ ను అందరూ తప్పనిసరిగా పాటించాలని WHO సూచించింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కుదుపు

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరికతో… ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు గుర్తించిన దేశాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో…. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అడ్డుకునేందుకు… తమ దేశంలోకి రాకుండా జాగ్రత్తపడేందుకు.. ఎయిర్ ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. పలు దేశాలు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చాయి. స్టాక్ మార్కెట్, చమురు రంగాలు బెంబేలెత్తిపోతున్నాయి. గ్లోబల్ ఎకనామిక్ రికవరీ ప్రాసెస్ లో ఇది మరో భారీ కుదుపుగా భావిస్తున్నారు.

ఎప్పుడు.. ఎక్కడ గుర్తించారు..?

నవంబర్ 9, 2021నాడు సౌతాఫ్రికాలో మొట్టమొదటి ఒమిక్రాన్ కేసు బయటపడింది. సౌతాఫ్రికాలో ఇప్పటికే వందకు పైగా ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. బొత్స్‌వానాలో నాలుగు, హాంగ్‌కాంగ్‌లో 2, బెల్జియం, ఇజ్రాయెల్, డెన్మార్క్ దేశాల్లో ఒక్కో కేసును గుర్తించారు. వారిని క్వారంటైన్ చేసి… కాంటాక్ట్‌లను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

స్టడీకి టైం పడుతుంది-WHO

ఒమిక్రాన్ వేరియంట్ పై అధ్యయనం చేసి.. పరిశోధనలు పూర్తిచేసేందుకు తమకు మరికొన్ని వారాల సమయం పడుతుందని WHO తెలిపింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాప్తి చెందుతుంది.. ప్రస్తుత పరీక్షలు సరిపోతాయా.. ఈ వైరస్ వేరియంట్ తో ఎంతవరకు ప్రమాదం… జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి.. అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామన్నారు. ఈ వైరస్ వేరియంట్ గాల్లో కూడా వ్యాపిస్తుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉందని WHO తెలిపింది.

Read This : Centre On New Strain : ఆఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్..భారత్ హైఅలర్ట్..రాష్ట్రాలకు కేంద్రం లేఖ