Centre On New Strain : ఆఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్..భారత్ హైఅలర్ట్..రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దక్షిణాఫ్రికా, హాంకాంగ్ మరియు బోట్స్వానా దేశాలలో కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం రేపిన నేపథ్యంలో ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్ మరియు టెస్టింగ్ కోసం

Centre On New Strain : ఆఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్..భారత్ హైఅలర్ట్..రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Testing

Centre On New Strain : దక్షిణాఫ్రికా, హాంకాంగ్ మరియు బోట్స్వానా దేశాలలో కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం రేపిన నేపథ్యంలో ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్ మరియు టెస్టింగ్ కోసం భారత్ గురువారం పిలుపునిచ్చింది. ఆ వేరియంట్ మనదేశంలోకి ప్రవేశించకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

కోవిడ్ కొత్త వేరియంట్ 8.1.1529 కేసులు బోట్స్వానా (3), దక్షిణాఫ్రికా (6) మరియు హాంక్ కాంగ్ (1 ) నమోదయ్యాయని NCDC రిపోర్ట్ చేసి్ది. ఈ వేరియంట్‌లో గణనీయమైన సంఖ్యలో ఉత్పరివర్తనలు ఉన్నట్లు నివేదించబడింది, అందువల్ల ఇటీవల సడలించిన వీసా పరిమితులు మరియు అంతర్జాతీయ ప్రయాణానికి తెరతీసిన దృష్ట్యా దేశంపై తీవ్రమైన ప్రజారోగ్య ప్రభావాలను కలిగి ఉంది అని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

అందువల్ల ఈ దేశాల నుండి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులతో పాటు వారితో పరిచయాలను కలిగిన వారిని కూడా కూడా కేంద్రహోంశాఖ మార్గదర్శకాల ప్రకారం నిశితంగా ట్రాక్ చేయాలి మరియు పరీక్షించబడాలి అని లేఖలో తెలిపారు.

ALSO READ New Covid-19 Varient : దక్షిణాఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్..భారీగా కొత్త కేసులు