New Covid-19 Varient : దక్షిణాఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్..భారీగా కొత్త కేసులు

దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. దేశంలో కొత్త కోవిడ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గురువారం తెలిపారు. B.1.1.529 అని పిలువబడే

New Covid-19 Varient : దక్షిణాఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్..భారీగా కొత్త కేసులు

Africa (1)

New Covid-19 Varient  దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. దేశంలో కొత్త కోవిడ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని భావిస్తున్నట్లు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గురువారం తెలిపారు. B.1.1.529 అని పిలువబడే ఈ వేరియంట్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉత్పరివర్తనలు కలిగి ఉందని తెలిపారు. బొట్స్వానా మరియు హాంకాంగ్‌లలో కూడా ఇది కనుగొనబడిందని చెప్పారు.

దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ కనుగొనబడటంలో ఆశ్చర్యమేమీ లేదు అని NICD(The National Institute For Communicable Diseases Of South Africa) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్రియన్ ప్యూరెన్ ఒక ప్రకటనలో తెలిపారు. 22 కొత్త వేరియంట్ కేసులను గుర్తించినట్లు NICD తెలిపింది. డేటా పరిమితంగా ఉన్నప్పటికీ, కొత్త వేరియంట్‌ను అర్థం చేసుకోవడానికి నిపుణులు పని చేస్తున్నారన్నారు. ఆ వేరియంట్ వల్ల తలెత్తబోయే సమస్యలు ఏమిటి అనే దానిని పరిశీలిస్తున్నారన్నారు.

ఈ కొత్త వేరియంట్ ను “తీవ్రమైన ఆందళన”గా అభివర్ణించారు దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా. ఇక,దేశంలో రోజువారీ కొత్త కేసులు ఈ నెల ప్రారంభంలో 100 ఉండగా..ఈ వేరియంట్ కారణంగా అమాంతరం పెరిగిపోయాయి. బుధవారం నాటికి దక్షిణాఫ్రికాలో రోజువారీ కొత్త కేసులు 1,200 కంటే ఎక్కువకు చేరుకున్నాయి.

ఆఫ్రికాలో ఇప్పటివరకు అత్యధిక కోవిడ్ కేసులు నమోదైంది దక్షిణాఫ్రికాలోనే. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 29లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదుకాగా, వీటిలో 89వేలకు పైగా మరణాలు సంభవించాయి.

ఇక,దక్షిణాఫ్రికా మరియు బోట్స్వానాలో వ్యాపిస్తున్న కొత్త కరోనావైరస్ వేరియంట్ గురించి చర్చించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు గురువారం సమావేశమయ్యారు.

ALSO READ Viral Video:‘నా పెన్సిల్ దొంగిలించాడు..ఈడి మీద కేసు పెట్టండి సార్..’ పోలీసులకు బుడ్డోడు ఫిర్యాదు..