North Korea Kim : కిమ్ కూతురికి నార్త్ కొరియా అధ్యక్ష బాధ్యతలు..?

కుమార్తె కిమ్ జు యే, భార్య రీ సోల్ జు తో సహా కొరియన్ ఆర్మీ జనరల్ సమావేశానికి వచ్చారు కిమ్. తొమ్మిదేళ్ల కిమ్ జు యే నార్త్ కొరియా తదుపరి అధ్యక్షురాలిగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ దేశ పాలన, సైనిక వ్యవహారాల్లో సింగిల్ గా కనిపించే కిమ్ తన కుమార్తెను సైనికులకు పరిచయం చేయడం ఇది నాలుగోసారి. కిమ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కానీ, రెండో కుమార్తె అంటేనే కిమ్ కు ఎక్కువ ప్రేమ అంటున్నారు.

North Korea Kim : కిమ్ కూతురికి నార్త్ కొరియా అధ్యక్ష బాధ్యతలు..?

North Korea Kim : కిమ్ మళ్లీ జనం ముందుకి వచ్చేశాడు. నెల రోజులుగా కనిపించని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దేశ సైనిక దినోత్సవంలో ప్రత్యక్షమయ్యాడు. అందరి అనుమానాలకు తెరదించుతూ సైనిక అధికారులతో చలాకీగా సమావేశమయ్యాడు కిమ్. కానీ, అక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది. తన గారాలపట్టి కుమార్తె కిమ్ జు యే సైనిక సమావేశానికి తీసుకురావడమే వరల్డ్ వైడ్ గా కొత్త డిబేట్ ను రాజేసింది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రతీ అడుగు సంచలనమే. అమెరికా కంట్లో నలుసుగా మారిన కిమ్, శత్రుదేశాలకు కొరకరాని కొయ్య. దేశం ఆకలితో మండిపోతున్నా అణ్వాయుధాల తయారీకే ప్రాధాన్యం ఇచ్చిన నియంత కిమ్. అలాంటి కిమ్ అప్పుడప్పుడు కనిపించడు. ఎటు వెళ్తాడో తెలీదు. ఏమైపోతాడో తెలీదు. అకస్మాత్తుగా కెమెరాలకు దూరంగా ఉంటుంటాడు కిమ్.

Also Read..North Korea: మరిన్ని అణ్వాయధ క్షిపణులు తయారు చేయండి.. అధికారులను ఆదేశించిన కిమ్

అనుక్షణం కిమ్ కదలికలపై నిఘా పెట్టే విదేశీ మీడియా కిమ్ కనిపించని ప్రతీసారి రకరకాల ఊహాగానాలను ప్రచారం చేస్తుంటుంది. ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఇక కోలుకోవడం కష్టమనే కథనాలను ప్రసారం చేస్తుంటుంది. ఆ ఊహాగానాలను పటాపంచలు చేస్తూ ఏదో ఒక సంచలనం సృష్టించి తన మనుగడ చాటుకుంటూ ఉంటాడు కిమ్.

ఇప్పుడూ అంతే. గత నెల రోజులుగా కనిపించని కిమ్ పై మళ్లీ ఏవేవో వార్తలు. ఎవరు ఎంతలా ప్రచారం చేసినా, కిమ్ ఎప్పుడూ స్పెషలే. ఈసారీ అంతే. దేశ సైనిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అత్యున్నత సైనికాధికారుల సమావేశానికి హాజరయ్యారు కిమ్. తన భార్య, బిడ్డతో కిమ్ ప్రత్యక్షమయ్యేసరికి మరోసారి అవాక్కవడం ప్రపంచ మీడియా వంతైంది.

Also Read..Kim’s Daughter: మరోసారి తన కూతురితో కలిసి సైనికుల వద్దకు కిమ్.. ఏం సందేశం ఇస్తున్నారు?

కుమార్తె కిమ్ జు యే, భార్య రీ సోల్ జు తో సహా కొరియన్ ఆర్మీ జనరల్ సమావేశానికి వచ్చారు కిమ్. తొమ్మిదేళ్ల కిమ్ జు యే నార్త్ కొరియా తదుపరి అధ్యక్షురాలిగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ దేశ పాలన, సైనిక వ్యవహారాల్లో సింగిల్ గా కనిపించే కిమ్ తన కుమార్తెను సైనికులకు పరిచయం చేయడం ఇది నాలుగోసారి. కిమ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కానీ, రెండో కుమార్తె అంటేనే కిమ్ కు ఎక్కువ ప్రేమ అంటున్నారు.

తండ్రి కిమ్ తో వచ్చిన కిమ్ జు యే కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది కొరియన్ సైన్యం. ప్రపంచ అత్యుత్తమ సైన్యంగా చెప్పుకునే కొరియన్ ఆర్మీ అధికారుల విందులో తండ్రి పక్కనే కనిపించింది కిమ్ జు యే. తండ్రి మాదిరిగా నలుపు రంగు సూట్ లో మెరిసిన కిమ్ జు యే ప్రపంచ మీడియాను ఆకర్షించింది. గత నవంబర్ లో కూడా తండ్రితో కలిసి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను వీక్షించింది కిమ్ జు యే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక రాజధాని ప్యాంగాంగ్ లో జరిగిన సైనిక కవాతులో పాల్గొన్న అధ్యక్షుడు కిమ్ ఎప్పటిలాగే శత్రుదేశాలను హెచ్చరించారు. తమ దేశ అణ్వాయుధాలను దృష్టిలో పెట్టుకోవాలని అమెరికా సహా శత్రు దేశాలకు హెచ్చరికలు పంపాడు కిమ్. అయితే కిమ్ కూతురిపైనే ప్రపంచ దేశాల దృష్టి పడింది. తన వారసురాలిగా కిమ్ జు యేను ప్రమోట్ చేయడం కోసమే ఈ మీటింగ్ కు ఆమెను తీసుకొచ్చి ఉంటారనే వాదన బలంగా వినిపిస్తోంది.