Imran Khan Arrest : పాకిస్థాన్‌లో హింసకు భారత్ కారణమంటూ పాక్ ఆరోపణలు

పాకిస్థాన్ భారత్ పై మరోసారి తన కుటిల బుద్దిని బయటపెట్టింది. పాక్ లో ఈ దుస్థితికి భారతే కారణం అంటూ ఆరోపిస్తోంది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా దేశంలో పరిస్థితులను చక్కబెట్టుకోలేక భారత్ పై ఆరోపణలు చేస్తోంది.

Imran Khan Arrest : పాకిస్థాన్‌లో హింసకు భారత్ కారణమంటూ పాక్ ఆరోపణలు

Imran Khan Arrest

Imran Khan Arrest: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్ అట్టుడికిపోతోంది. ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో భద్రతాదళాలు కాల్పులు జరుపుతున్నారు. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా హింసాత్మక చర్యలు కొనసాగుతున్న క్రమంలో పాకిస్థాన్ తన కుటిల బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. పాకిస్థాన్ లో హింసాత్మక చర్యలకు భారతే కారణం అంటూ వింత ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలు చేసింది సామాన్యలు కాదు..సాక్షాత్తు ప్రస్తుత ప్రధానిగా ఉన్న షెహబాజ్‌ షరీఫ్‌ ప్రత్యేక సహాయకుడు అట్టా తరార్.

Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..

పాకిస్థాన్‌ జరుగుతున్న అల్లర్లకు..హింసాత్మక ఘటనల వెనుక భారత్ హస్తం ఉందని, భారత్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాలు తమ మనుషులను పంపి తమ దేశంలో అల్లర్లు చేయిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ప్రధాని ప్రత్యేక సహాయకుడిగా ఉన్న అట్టా తరార్. సామాన్యులు..లేదా తీవ్రవాదులు ఇటువంటి అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన పనిలేదు. భారత్ పై ఉన్న ఈర్ష్యతోనో, కక్షతోనో చేసారనుకోవచ్చు. కానీ సాక్షాత్తు కానీ సాక్షాత్తూ పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రత్యేక సహాయకుడు అట్టా తరార్‌ ఈ ఆరోపణలు చేయడం గమనించాల్సిన విషయం.

‘మా దేశంలో అల్లర్లు జరగ్గానే భారత్‌లో సంబరాలు చేసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ స్వీట్లు పంచుకుని సెలబ్రేట్ చేసుకుంది’ అని అట్టా తరార్ ఆరోపించారు. పాకిస్థాన్ లో తిరుగుబాటుకు కారణం భారతేనని అన్నారు.పాకిస్థాన్ లో పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ హింసను ప్రోత్సహిస్తోంది అంటూ ఆరోపించారు. మరి అట్టా తరార్ వ్యాఖ్యలపై ఆదేశ ప్రధాని ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి..అలాగే భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Imran Khan Arrest: ఈ టైములో ఇమ్రాన్ అరెస్టు అవసరమా.. పాకిస్థాన్ లో ఇంతకీ ఏం జరుగుతుంది..?