Pakistan: ట్యాక్స్ కట్టకపోతే ఓటు హక్కు ఉండదు..దుమారం రేపుతున్న పాక్ ఆర్థిక సలహాదారు హెచ్చరిక

ట్యాక్స్ కట్టకపోతే ఓటు హక్కు ఉండదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు చేసిన హెచ్చరిక దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది.

Pakistan: ట్యాక్స్ కట్టకపోతే ఓటు హక్కు ఉండదు..దుమారం రేపుతున్న పాక్ ఆర్థిక సలహాదారు హెచ్చరిక

No Right To Vote If You Don't Pay Your Taxes

No right to vote if you don’t pay your taxes : పన్ను కట్టకపోతే ఓటు వేసే హక్కు ఉండదు. ఇప్పుడు ఈ హెచ్చరిక పాకిస్థాన్ లో సెగలు రేపుతోంది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు షౌకత్ తరీన్ చేసిన ప్రకటన పాకిస్తాన్ లో పెను దుమారం రేపుతోంది. ఆదాయపు పన్ను, జీఎస్టీ చెల్లించని వారికి ఓటు హక్కు కూడా రాదని తరిన్ చెబుతున్నారు. షౌకత్ గత కొన్ని వారాల క్రితం వరకు  దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న తరిన్ క్యాబినెట్ ఎన్నిక కాలేదు. దీంతో తరీన్ పై ఇమ్రాన్ కు ఉన్న అభిమానంతో  అతనిని రాత్రికి రాత్రే తన ఆర్థిక సలహాదారునిగా నియమించేసుకున్నారు. దీంతో షాకత్ రాత్రికి రాత్రే దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేయాలని కంకణం కట్టుకున్నట్లుగా ఇలా నియమించబడ్డారో లేదో అలా పన్నులు కట్టాలి అంటూ థమ్కీ ఇచ్చేస్తున్నారు. ట్యాక్సులు కట్టనివారికి ఓటు వేసే హక్కు ఉండదు అంటూ హెచ్చరికలు జారీ చేయటంతో దేశంలో పెను దుమారం రేగింది.

Read more : Food Crises in Pakistan: ‘ప్రజలు ఒక్కపూటే తినండీ తక్కువ తినండీ’ : పాక్ మంత్రిగారి వ్యాఖ్యలు

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో సోమవారం (నవంబర్ 8,2021)  ఒక సైనిక కార్యక్రమంలో షౌకత్ తరీన్ పాల్గొన్న సందర్భంగా వ్యాపారవేత్తలకు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘పాకిస్తాన్ లో వ్యాపారవేత్తలందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను..ప్రతి వ్యాపారి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను కచ్చితంగా చెల్లించాలి. లేకుంటే వారికి ఓటు హక్కు ఉండదు. ఆదాయపన్ను, జీఎస్టీ కడితేనే మిగిలిన పన్ను మినహాయించుకోవచ్చు అంటూ సూచించారు.  చిన్న వ్యాపారులు. మధ్యతరహా (SMEలు) వ్యాపారులతో పాటు ఐటీ రంగాలకు చెందిన వారి వద్ద డబ్బులు లేకపోతే వారిని ప్రభుత్వం ఆదుకుంటుందనీ..సుమారు 40 లక్షల అణగారిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రారంభించిన యువనేస్తం కార్యక్రమం కింద వడ్డీలేని వ్యవసాయం, వ్యాపార రుణాలు అందిస్తున్నామని తెలిపారు.

Read more : Imran Khan : మహిళలు పొట్టి బట్టలు వేసుకోవటం వల్లే అత్యాచారాలు..మగవాడు రోబో అయితే తప్ప..

ఐఎంఎఫ్ తో వ్యవహరించలేని కారణంగా..
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా ఇబ్బందికరంగా మారింది. దేశంలో పలు నిత్యావసర వస్తువుల ధరలు భారీస్థాయికి చేరుకున్నాయి. గత నెల వరకు షౌకత్ తరిన్ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అతని సోదరుడు జహంగీర్ తారిన్ పంజాబ్ రాష్ట్ర సీఎం. షౌకత్ గత నెలలో పెద్ద ప్రతినిధుల బృందంతో న్యూయార్క్ వెళ్లారు. అక్కడ ఐఎంఎఫ్ బోర్డుతో 11 రోజుల పాటు చర్చలు జరిపారు. అయినా..వారు పాకిస్తాన్‌కు 6.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీని మినహాయించి మొదటి విడత కూడా పొందలేకపోయారు. ఆ తర్వాత సెనేట్‌ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆర్థిక మంత్రి పదవి కూడా పోయింది. దీంతో ఇమ్రాన్ షౌకత్ మీద ఉన్న అభిమానం కొద్దీ అతన్ని ఆర్థిక సలహాదారునిగా నియామకం చేశారు.

పాక్ లో మూడేళ్లలో నలుగురు ఆర్థిక మంత్రులు
ఇమ్రాన్ ఖాన్ 2018లో అధికారంలోకి వచ్చాక నలుగురు ఆర్థిక మంత్రులను మార్చారు. ఈ నలుగురూ ఇమ్రాన్ కు సన్నిహిత మిత్రులు. దీంతో రాజు తలచుకుంటే ఏమైనా చేస్తారన్నట్లు షౌకత్ తరీన్ కు ఆర్థిక సలహాదారునిగా నియమించుకున్నారు. తరీన్ కు ఓ పదవి పోయినా మరో పదవి దక్కించుకోగా అతని సోదరుడు జహంగీర్ తరీన్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.