China Pakistan: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో ఇమ్రాన్ ఖాన్ భేటీ

ఇమ్రాన్ ఖాన్.. ఆదివారం అక్కడి గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ తో సమావేశం అయ్యారు.

China Pakistan: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో ఇమ్రాన్ ఖాన్ భేటీ

China1

China Pakistan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో సమావేశం అయ్యారు. చైనాలో జరుగుతున్న “వింటర్ ఒలింపిక్స్” ప్రారంభోత్సవాల్లో పాల్గొనేందుకు బీజింగ్ చేరుకున్న ఇమ్రాన్ ఖాన్.. ఆదివారం అక్కడి గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ తో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా వీరిరువురు.. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరుచుకునేందుకు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు జిన్‌పింగ్..దక్షిణాసియా ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇరు దేశాలు CPEC సహా, పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో సహాయసహకారాలు ఇచ్చిపుచ్చుకోనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

Also read: Australia Borders: అంతర్జాతీయ పర్యాటకులను అనుమతించనున్న ఆస్ట్రేలియా

పాకిస్తాన్ ను ఎదుర్కొనేందుకు భారత్ భారీగా సైన్యాన్ని పోగుజేస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన ఇమ్రాన్ ఖాన్..జమ్మూ కాశ్మీర్లోని పాక్ ఆక్రమిత భూభాగాన్ని భారత్ అన్యాయంగా ఆక్రమించుకుందని చెప్పుకొచ్చాడు. భారత్ ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్ లో మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని బీజింగ్ వేదికగా ఇమ్రాన్ ఖాన్ విషంకక్కాడు. ఈ విషయాలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందిస్తూ.. తన జాతీయ స్వాతంత్య్రన్ని, సార్వభౌమత్వవాన్ని, అలాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పాకిస్తాన్ కు చైనా సహకారం ఉంటుందని అభయం ఇచ్చారు.

Also read: Chandrababu: కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు?: చంద్రబాబు

ఇక చైనా – పాక్ మధ్య సంబంధాలు బలపరుచుకోవడమే లక్ష్యంగా జరిగిన ఈ భేటీలో ఇరుదేశాధినేతలు పలు అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. CPEC ప్రాజెక్ట్ సహా..ద్వైపాక్షిక ఆర్థిక అంశాలను మరింత బలోపేతం చేసుకోవడం మరియు బహుముఖ వ్యూహాత్మక సహకార సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు చర్చలు జరిపారు. ఇరు దేశాల భవిష్యత్తు కోసం పాకిస్థాన్-చైనా ద్వంద్వ సమాజాన్ని నిర్మించేందుకు ఈ చర్చలు తోడ్పడతాయని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే.. వింటర్ ఒలింపిక్స్ నిర్వహణను..చైనా తన రాజకీయ లబ్ధికోసం వాడుకుంటుందని ప్రపంచ దేశాలు ఆక్షేపించాయి. కరోనా మహమ్మారి కారణంగా అమెరికా, యూరోప్ దేశాలతో చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఒలింపిక్స్ ను సాకుగా చూపి ఆయా దేశాలను బుజ్జగించేందుకు చైనా ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు వచ్చాయి.

Also read: PM Narendra Modi: కొందరికి కలలో కృష్ణుడు కనిపిస్తున్నాడు: అఖిలేష్ యాదవ్ పై మోదీ సెటైర్