Viral Video: అయ్య బాబోయ్.. ఇదేం కొట్టుకోవడంరా నాయనా..! వీడియో వైరల్..

ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆ ఇద్దరు మెటల్ తో తయారు చేసిన హెల్మెంట్లు ధరించి ఉన్నారు. మనం దోసెలు వేసుకొనే పెనంలాంటి వస్తువును ఒకటి పట్టుకొని తలపై ఒకరినొకరు కొట్టుకోవటం మొదలు పెట్టారు. అలా కొట్టుకొనే క్రమంలో ఒకరు కిందపడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: అయ్య బాబోయ్.. ఇదేం కొట్టుకోవడంరా నాయనా..! వీడియో వైరల్..

New Game

Viral Video: ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆ ఇద్దరు మెటల్ తో తయారు చేసిన హెల్మెంట్లు ధరించి ఉన్నారు. మనం దోసెలు వేసుకొనే పెనంలాంటి వస్తువును ఒకటి పట్టుకొని తలపై ఒకరినొకరు కొట్టుకోవటం మొదలు పెట్టారు. అలా కొట్టుకొనే క్రమంలో ఒకరు కిందపడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని పాన్ స్లాపింగ్ కాంటెస్ట్ అంటారట. ఆ విచిత్రమైన పోటీలను చూసేందుకు జనంసైతం ఎగబడ్డారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయ్యబాబోయ్.. ఇదేం కొట్టుకోవటంరా నాయనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Anand Mahindra: కేటీఆర్.. మీరు అలాచేస్తే టాలీవుడ్ మిమ్మల్ని లాగేసుకుంటుంది..

పాన్ స్లాపింగ్ కాంటెస్ట్ కు సంబంధించిన వీడియోను మాజీ NBA ఆటగాడు రెక్స్ చాప్‌మన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తలపై కొట్టుకోవడం కనిపించింది. ఈ విచిత్రమైన ఆటను చూసేందుకు జనం గుంపులుగా ఉన్నట్లు వీడియోలో చూడొచ్చు. ఇద్దరు పాల్గొనేవారు మెటల్ నైట్ హెల్మెట్‌లను ధరించి కనిపించారు. ఈ హెల్మెంట్ తీవ్రమైన గాయం నుండి వారి తలలను కాపాడుతుంది. వారిలో ఒకరు కిందపడిపోయే వరకు కొట్టుకున్నారు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు మిలియన్ల కంటే ఎక్కువ మంది నెటిజన్లు వీక్షించారు. వేల సంఖ్యలో లైక్ లు కొట్టి సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇదేం ఆటరా బాబూ అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు.

Ap Politics: నేడు పల్నాడు జిల్లాలో లోకేష్ పర్యటన.. అప్రమత్తమైన పోలీసులు

ఈ వీడియోపై స్పందించిన నెటిజన్ సరదా కామెంట్ చేశాడు. నా ప్రజల సంప్రదాయాలను వెక్కిరించవద్దు పేర్కొన్నాడు. అయితే పాన్ స్లాపింగ్ పోటీ ఉనికిలో ఉన్న వింత పోటీ మాత్రమే కాదు. గత మార్చిలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ స్థాపించిన ఆర్నాల్డ్ స్పోర్ట్స్ ఫెస్టివల్ “స్లాప్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్” ను ప్రారంభించారు. అధికారిక నిబంధనల ప్రకారం.. ప్రతి రౌండ్‌లో ఒక్కో పోటీదారునికి ఒక స్లాప్‌తో మూడు రౌండ్‌లు ఉంటాయి. చెంపదెబ్బ తగిలిన 30 సెకన్లలోపు తిరిగి కొట్టేలా ఉండాలి. ఆటగాడి సామర్థ్యం ఆధారంగా నాకౌట్‌ను ముగ్గురు న్యాయమూర్తులు స్కోర్ చేస్తారు. స్లాప్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ కంటే ముందు మొట్టమొదటి ప్రొఫెషనల్ “పిల్లో ఫైటింగ్ ఛాంపియన్‌షిప్” కూడా జనవరి 2022లో యునైటెడ్ స్టేట్స్‌లో జరిగింది.