యజమాని హత్య,అత్యాచారానికి గురైన కేసులో పెంపుడు చిలుక సాక్ష్యం!

  • Published By: nagamani ,Published On : May 26, 2020 / 10:44 AM IST
యజమాని హత్య,అత్యాచారానికి గురైన కేసులో పెంపుడు చిలుక సాక్ష్యం!

తన యజమానిని అత్యాచారం చేసి హత్య చేసిన వారి గురించి ఓ చిలుకగా కీలక సాక్ష్యంగా నిలిచింది. ఆ చిలుకను పోలీసులు..లాయర్లు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో ఆ చిలుక సాక్ష్యం అత్యంత కీలకంగా మారింది. ఆ చిలుక చెప్పిన మాటలతోనే ఓ మహిళ అత్యాచారం..హత్యకు గురైనట్లుగా నమ్మారు. దీంతో హత్యాచారానికి గురై చనిపోయిన మహిళ కేసులో చిలుక సాక్షిగా ప్రవేశపెట్టనున్నారు. 

మనుషులు సాక్ష్యం చెప్పిన ఘోరాతి ఘోరమైన రేప్ కేసుల్లో నిందుతులకు శిక్షలు పడటం కష్టంగా మారిన ఈ రోజుల్లో ఓ చిలుక సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటారా? అనే అనుమానం రావచ్చు. కానీ ఇది నిజం. ఆ చిలుకను కోర్టులో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు పోలీసులు. ఈ  వింత అరుదైన ఘటన తూర్పు అర్జంటీనాలోని గ్రేట్ బ్యూనస్ ఎయిర్స్‌లోని శాన్ ఫెర్నాండో నగరంలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. సాన్ ఫెర్నాండో‌  అనే 46 ఏళ్ల ఎలిజబెత్ టొలేడో‌ తూర్పు అర్జంటీనాకు చెందిన మహిళ. డిసెంబర్ 2018లో కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేసి చంపేశారు. ఆ సమయంలో అదే ప్రాంతంలో డ్యూటీ చేస్తున్న పోలీసు అధికారికి ఎవరో అరుస్తున్నట్లుగా  వినిపించింది. ఎక్కడాని పరిశీలించారు. ఓ అపార్టుమెంటులోని ఫ్లాట్ నుంచి.. ‘‘వద్దు.. ప్లీజ్, నన్ను వదిలేయ్’’ అని ఓ మహిళ బతిమాలుకుంటున్నట్లుగా అరుపులు వినిపించాయి. దీంతో ఆ పోలీసు అటుగా వెళ్లాడు. 

వెంటనే ఆ ఫ్లాట్ తలుపు తెరిచి చూసేసరికి రక్తపు మడుగులో నగ్నంగా పడివున్న ఓ మహిళ కనిపించింది. అక్కడే పంజరంలో ఉన్న ఓ చిలుక ‘‘వద్దు.. ప్లీజ్, నన్ను వదిలేయ్’’ అని అరుస్తోంది. ఆ చిలుక అత్యాచారానికి గురై చనిపోయిన సదరు మహిళదని..తన యజమాని చనిపోతూ అరిచిన అరుపులనే ఆ చిలుక చెబుతుందని భావించాడు.  

దీనిపై క్లారిటీ కోసం ఆ పోలీస్ అధికారి ఆ ఇంటికి చుట్టుపక్కలవారిని విచారించాడు. దానికి వాళ్లు కొద్దిసేపటి క్రితం  ఆ చిలుక ‘‘నన్ను ఎందుకు కొడుతున్నావ్’’ అని అరిచిందని..ఆ ఇంటిలోఎలిజబెత్ టొలేడో పాటు మరో ఇద్దరు అంటే మొత్తం ముగ్గురు కలిసి ఉంటున్నారని పక్కింటి మహిళ చెప్పింది.  

తరువాత పలు విధాలుగా ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ రూమ్ మేట్స్‌ మిగ్యూల్ సాటర్నినో రోలోన్ మరియు జార్జ్ రౌల్ అల్వారెజ్ లను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. వారిలో ఇద్దరిలో ఒకరికి దీంతో సంబంధంలేదని వదిలిపెట్టారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో చిలుక సాక్ష్యం కీలకంగా ఉంది. 

దీంతో త్వరలోనే ఆ చిలుకను సాక్ష్యం కోసం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ చిలుక నిందితుల పేర్లు చెప్పవచ్చని భావిస్తున్నారు. పోలీసులు చిలుక సాక్ష్యాన్నే మెయిన్ గా తీసుకోకుండా అన్ని రకాలుగాను విచారణ జరిపారు. చిలుక సాక్ష్యమే కాకుండా ఎలిజబెత్ టొలేడో పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమెవంటిపై లభించిన పంటి గాట్లు..ఆమె శరీరంపై ఉన్న మిగిలిన గాయాలువంటివి నిందితులతో పోల్చి చూడగా కరెక్ట గా సరిపోయానని తేలింది.  దీంతో చిలుక చెప్పేది నిజమేనని నమ్ముతున్నారు.

తన యజమాని చివరి మాటల్నే చిలుక చెబుతోందని రూఢీ చేసుకున్నారు. దీంతో చిలుకను కోర్టులో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో చిలుక చెప్పే సాక్ష్యం కీలకంగా ఉంటుందనీ ఈ కేసును ప్రాసిక్యూట్ చేస్తున్న లాయర్ బియానా సాంటెల్లా తెలిపారు.