Japan – India: జపాన్ ప్రధానితో మోదీ భేటీ: ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చ

భారత్-జపాన్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా..శాంతి, సమృద్ధి, పురోగతి సాధించడంలో ఇరు దేశాలు భాగస్వామ్యంగా వ్యవహరించనున్నాయని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.

Japan – India: జపాన్ ప్రధానితో మోదీ భేటీ: ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చ

Modi Japan

Japan – India: జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాధినేతలు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు భారత ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ – జపాన్ మధ్య ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై ఇరువురు చర్చించారు. శనివారం మధ్యాహ్నం అనంతరం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో భారత్ – జపాన్ 14వ వార్షిక సదస్సును నిర్వహించారు. భారత్-జపాన్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా..శాంతి, సమృద్ధి, పురోగతి సాధించడంలో ఇరు దేశాలు భాగస్వామ్యంగా వ్యవహరించనున్నాయని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.

Also Read: Rakesh jhunjhunwala : ఒక్కరోజులో రూ. 861 కోట్లు సంపాదన

రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని కిషిడాకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా భారత్ లో 42 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది జపాన్. దీంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో భారత్ లో ఐదో అతిపెద్ద దేశంగా జపాన్ నిలువనుంది. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, మెట్రో ప్రాజెక్టులతో పాటు ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు (డిఎంఐసి) కోసం ఉపయోగించే హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టుపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. జపాన్ కు చెందిన షింకన్సెన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు రూపొందించనున్నారు.

Also Read: Japan PM Fumio Kishida : ప్ర‌ధాని మోడీతో భేటీ కానున్న జపాన్ ప్రధాని పుమియో కిషిడా

వీటితో పాటుగా మే- జూన్ మధ్య జరిగే క్వాడ్ నేతల రెండో శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావాలని జపాన్ ప్రధాని కిషిడా భారత ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం ఉంది. యుక్రెయిన్ యుద్ధం, దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు చర్యలతో పాటు జపాన్, భారత్ మధ్య ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై క్వాడ్ భాగస్వాములు చర్చించనున్నారు.