PM Modi: జీ7 సదస్సులో పాల్గొననున్న మోదీ

కోవిడ్ తర్వాత మోదీ పాల్గొనబోతున్న అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే. జర్మనీలో రెండు రోజులు సదస్సుకు హాజరైన తర్వాత 28న ప్రధాని యూఏఈ వెళ్తారు. అక్కడ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయేద్‌ మృతికి సంతాపం ప్రకటించి, నివాళులు అర్పిస్తారు.

PM Modi: జీ7 సదస్సులో పాల్గొననున్న మోదీ

Pm Modi (1)

PM Modi: ఆదివారం నుంచి ప్రారంభం కానున్న 48వ జీ7 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు. జర్మనీలోని మ్యునిచ్‌లో ఈ సదస్సు జరుగుతుంది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఈ సదస్సు జరుగుతుంది. 26, 27 తేదీల్లో ప్రధాని పాల్గొంటారు. కోవిడ్ తర్వాత మోదీ పాల్గొనబోతున్న అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే. జర్మనీలో రెండు రోజులు సదస్సుకు హాజరైన తర్వాత 28న ప్రధాని యూఏఈ వెళ్తారు. అక్కడ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయేద్‌ మృతికి సంతాపం ప్రకటించి, నివాళులు అర్పిస్తారు.

Drink Lassi: యూనివర్సిటీల్లో లస్సీనే తాగండి: పాక్ విద్యా శాఖ ఆదేశం

జీ 7 అంటే ప్రపంచంలోని ఏడు అత్యంత ధనిక దేశాలు. ఈ సదస్సులో జీ 7 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెంపు, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. ఈ సదస్సులో భారత్, జర్మనీతోపాటు అర్జెంటీనా, సెనెగల్, ఇండోనేషియా, దక్షిణఫ్రికా దేశాలు అతిథి దేశాలుగా పాల్గొనబోతున్నాయి. ఈ పర్యటన సందర్భంగా మోదీ మొత్తం 12 మంది దేశాధినేతలతో సమావేశమవుతారు. సదస్సు సందర్భంగా మ్యునిచ్‌లో భారతీయులతో ఏర్పాటు చేసిన ఒక సభలో మోదీ ప్రసంగిస్తారు.