Khalistani separatist : ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజ్జర్ హత్యపై కెనడా పోలీసుల విచారణ

Khalistani separatist : ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజ్జర్ హత్యపై కెనడా పోలీసుల విచారణ

terrorist Nijjar

Updated On : September 29, 2023 / 10:09 AM IST

Khalistani separatist : ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ తెలిపింది. జూన్ 18 వతేదీన బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్డీప్ సింగ్ హత్యకు గురయ్యారు. 2020 వసంవత్సరంలో భారతదేశం నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. (Probe into terrorist Nijjars killing say Canadian police) 45 ఏళ్ల నిజ్జర్ హత్యను ఆర్‌సిఎంపి ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం (ఐహెచ్‌ఐటి) దర్యాప్తు చేస్తోంది.

Asian Games : 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో భారత్‌ పురుషుల జట్టుకు స్వర్ణ పతకం

బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని గురు నానక్ సిక్కు గురుద్వారా సాహిబ్ వద్ద నిజ్జర్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన భద్రతా కెమెరా ఫుటేజీని వెలుగుచూసిన ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆఫీసర్లతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు తన తండ్రి రెగ్యులర్ సమావేశాలు జరిపినట్లు నిజ్జర్ కుమారుడు బాల్రాజ్ నిజ్జర్ చెప్పారు. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ అసంబద్ధమైనవని కొట్టిపారేసింది.