Qureshi : లండన్‌లో పాక్‌ మంత్రికి చుక్కెదురు

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషికి లండన్‌లో చేదు అనుభవం ఎదురైంది. అక్కడి నివసిస్తున్న కశ్మీర్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది.

Qureshi : లండన్‌లో పాక్‌ మంత్రికి చుక్కెదురు

Qureshi

Qureshi : పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషికి లండన్‌లో చేదు అనుభవం ఎదురైంది. అక్కడి నివసిస్తున్న కశ్మీర్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. కశ్మీర్‌తోపాటు సింధ్‌, బలూచ్ ఫోరం కార్యకర్తలు లండన్‌లోని ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ నివాసం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. అఫ్ఘాన్ పరిస్థితి దారుణంగా తయారు కావడానికి కారణం పాకిస్తాన్ అన్ని వారిని నమ్మొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యానర్లు ఫలకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

Read More : Self Abortion: యూట్యూబ్ చూసి..ఏడవ నెలలో అబార్షన్ చేసుకున్న యువతి..ఏమైందంటే..

మూడు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లారు షా మెహమూద్‌ ఖురీషి. ఆయన రాకను నిరసిస్తూ గులాం కాశ్మీర్, జమ్మూకాశ్మీర్ గిల్గిట్, బాల్టిస్టాన్, లడఖ్ నేషనల్ ఈక్వల్ పార్టీ సజ్జాద్ రాజా నేతృత్వంలో పాకిస్తాన్ హైకమిషనర్ నివాసం ముందు గుమిగూడారు. ఉగ్రవాదానికి ప్రోత్సనిస్తున్న పాకిస్తాన్ కు నిధులు నిలిపివేయాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని నిరసన కారులు కోరారు.

అఫ్ఘాన్ వినాశనానికి కారణమైన పాకిస్తాన్ ని నమ్మొద్దని బ్రిటిష్ ప్రభుత్వానికి, అంతర్జాతీయ సమాజానికి వారు విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ చేసిన తప్పిదాలే అఫ్ఘానిస్తాన్ కు శాపంగా మారాయని తెలిపారు. పాకిస్తాన్ ప్రవాసులు ఇలా తమ దేశ మంత్రికి వ్యతిరేకంగా లండన్‌లో నిరసనలు తెలుపడం గతంలో జరుగలేదు.

Read More : Posani : పవన్ కళ్యాణ్‌పై పోసాని ఫైర్..