Rahul Gandhi: ఐఫోన్ పట్టుకుని హలో మిస్టర్ మోదీ.. అంటూ రాహుల్ గాంధీ జోక్స్.. ఎందుకంటే?
డేటా రక్షణ, భద్రతపై సరైన నిబంధనలు ఉండాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు.

Rahul Gandhi
Rahul Gandhi – Washington: ప్రధాని మోదీకి కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ చురకలు అంటించారు. అమెరికాలోని వాషింగ్టన్ (Washington) లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ సిలికాన్ వ్యాలీ (Silicon Valley)కి చెందిన స్టార్టప్ వ్యవస్థాపకులతో సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తన ఐఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుని.. “హలో మోదీ” అని అన్నారు. తాను ఫోనులో ఎవరితో మాట్లాడుతున్నా మోదీ వింటుంటారని పరోక్షంగా చెప్పారు. తన ఫోనును ట్యాప్ చేస్తున్నారని అన్నారు. పెగాసస్ స్పైవేర్, ఇతర స్నూపింగ్ టెక్నాలజీల గురించి తనకు భయమేంలేదని తెలిపారు.
డేటా రక్షణ, భద్రతపై సరైన నిబంధనలు ఉండాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రస్తుతం భారత్-చైనా మధ్య పరిస్థితులు బాగోలేవని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైందేనని తెలిపారు. కాగా, అమెరికా పర్యటనలో మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీతో పాటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్పర్సన్ శామ్ పిట్రోడాతో సహా పలువురు సహాయకులు ఉన్నారు.
V Hanumantha Rao: జైలు ముందు వీహెచ్ ధర్నా.. మరో నయీమ్ తయారయిండని కామెంట్స్