Russia invasion of Ukraine : ఆయుధాలు ఇస్తాం.. దేశం కోసం పోరాడండి.. ప్రజలకు యుక్రెయిన్ అధ్యక్షుడు పిలుపు

యుక్రెయిన్‌లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా దాడులతో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు.

Russia invasion of Ukraine : ఆయుధాలు ఇస్తాం.. దేశం కోసం పోరాడండి.. ప్రజలకు యుక్రెయిన్ అధ్యక్షుడు పిలుపు

Russia Invasion Of Ukraine Ukraine’s Leader Urges Civilians To Fight, Promises To Arm All

Russia invasion of Ukraine : యుక్రెయిన్‌లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా దాడులతో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యాతో యుద్ధంలో పోరాడేందుకు ఆయుధాలిస్తాం.. దేశం కోసం పోరాడేవాళ్లు ఎవరో ముందుకు రావాలని దేశ పౌరులకు ఆయన పిలుపునిచ్చారు. ‘దేశం కోసం పోరాడాలనుకునేవారికి మేం ఆయుధాలిస్తాం. యుక్రెయిన్‌కు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉండండి’’ అని జెలెన్‌స్కీ ట్విటర్‌ ద్వారా ప్రజలను కోరారు.

దేశాన్ని కాపాడుకునేందుకు జరిగే పోరాటంలో దేశ పౌరులందరూ ముందుకు రావాలని యుక్రెయిన్ అధ్యక్షుడు ప్రజలను కోరారు. దేశాన్ని కాపాడే వారు ఎవరైనా ఆయుధాలతో పోరాడవచ్చునని పిలుపునిచ్చారు. రష్యా-యుక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్నిరోజులుగా సామాన్య పౌరులకు కూడా యుక్రెయిన్‌ సైనికులు ఆయుధాల్లో శిక్షణ అందిస్తున్నారు. రష్యా నుంచి తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధమంటూ చాలామంది ముందుకు వచ్చారు. వారిలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతోమంది సైనికుల నుంచి శిక్షణ తీసుకున్నారు. తుపాకుల ఎలా పేల్చాలో కూడా నేర్చుకున్నారు.

Russia Invasion Of Ukraine Ukraine’s Leader Urges Civilians To Fight, Promises To Arm All (2)

Russia Invasion Of Ukraine Ukraine’s Leader Urges Civilians To Fight, Promises To Arm All 

రష్యా యుద్ధం చేస్తున్న క్రమంలో దేశ పౌరులంతా కలిసి కట్టుగా పోరాడాలని యుక్రెయిన్‌ ప్రభుత్వం కోరుతోంది. యుక్రెయిన్‌లో రష్యా వైమానిక దాడుల్లో మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్పటివరకు 40 మంది యుక్రెయిన్‌ సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. రష్యా దాడుల్లో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య భారీగానే ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. యుక్రెయిన్‌లోని నివాస ప్రాంతాలపై రష్యా వైమానిక దాడులు ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రష్యా వైమానిక దాడులను యుక్రెయిన్ సైనిక దళం కూడా ధీటుగానే తిప్పికొడుతోంది. రష్యానికి సంబంధించిన పలు యుద్ధ విమానాలను యుక్రెయిన్ సైన్యం కూల్చేసింది. ఈ మేరకు యుక్రెయిన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రష్యా బలగాలు ఇప్పటికే సరిహద్దులను దాటి యుక్రెయిన్‌ భూభాగంలోకి చొచ్చుకునిపోయాయి. తమ భూభాగంలోకి ప్రవేశించిన 50 మంది రష్యన్‌ సిబ్బందిని యుక్రెయిన్ సైనిక బలగాలు హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన రష్యా ఆ వార్తలను ఖండించింది.

Read Also : Ukraine Russia War : యుక్రెయిన్‌ పై రష్యా బాంబుల మోత.. యుక్రెయిన్‌ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు