Russia-Ukraine War: చంకలో చంటిబిడ్డలు..కన్నీటితో యుక్రెయిన్ ను వీడుతున్న తల్లులు
చంకలో చంటిబిడ్డలు..చేతిలో సామాన్లు భర్తలను వదిలి కన్నీటితో యుక్రెయిన్ ను వీడుతున్నారు మహిళలు.మరోపక్క భార్యబిడ్డల్ని సాగనంపుతు మగవారు చంటిబిడ్డల్లా ఏడుస్తున్న దృశ్యాలు యుక్రెయిన్ ల

Russias Military Action On Ukraine Mothers With Kids Could Spark Another Migrant Crisis
Russia-Ukraine War : రష్యా సేనలు రాక్షుసుల్లా యుక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకర్ల బాంబులు దాడులు చేస్తుంటే ఆ శబ్దాలకు చిన్నారులు హడలిపోతున్నారు.అమ్మ గుండెల్లో తలదాచుకుని నాన్న వంక బేలగా అమాయకంగా చూస్తూ….‘డాడీ ఏజరుగుతోంది? మనం చచ్చిపోతామా?’అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు తల్లిదండ్రులు. బిడ్డలను వదల్లేక తండ్రులు..భర్తను వదల్లేక భార్య చంకలో చంటి బిడ్డలను ఎత్తుకుని..చేతిలో సామాన్లు పట్టుకుని కన్నీటితో మాతృదేశం యుక్రెయిన్ ను వీడి వెళుతున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. యుక్రెయిన్ లో ఎక్కడ చూసిన ఇటువంటి భావోద్వేగపు దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఎంతోమంది మెట్రో అండర్ గ్రౌండ్ లోను..బంకర్లలోను తలదాచుకుంటున్నారు.
Also read : Russia-Ukraine: పుతిన్ కాళ్లపై పడి క్షమాపణ అడుగు: జెలెన్స్కీకీ చెచెన్యా నేత హితవు
రష్యా దూకుడుకు యుక్రెయిన్ తాళలేకపోతోంది. రష్యా సైనిక చర్యను కొనసాగిస్తుండటంతో.. సుమారు 50 లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకొని, సరిహద్దులు దాటి, పొరుగున ఉన్న ఐరోపా దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఐరాస అనుబంధ సంస్థలు స్వయంగా వెల్లడించాయి.
ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇప్పటికే రొమేనియా, హంగరీ, పొలండ్, స్లొవేకియాలోకి ప్రవేశించారు. మగవారు మాత్రం యుద్ధంలో సహకరించేందుకు ఉండిపోయారు. భార్యలకుబిడ్డలైనా జీవించి ఉండాలని బలవంతంగా వారిని వేరే దేశాలకు పంపించేస్తున్నారు. మూడో రోజు కూడా రష్యా యుక్రెయిన్ పై అత్యంత దారుణంగా విరుచుకుపడుతోంది. దీంతో 48 గంటలలోపే 50 వేల మందికి పైగా ఉక్రెనియన్లు దేశం విడిచి వెళ్లిపోయారు. చంకలో పిల్లలు, చేతిలో సామాన్లు పట్టుకొని, తమ ఆత్మీయుల్ని ఆలింగనం చేసుకొని, కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాల్లో కనిపిస్తున్నాయి.
Also read : చేతులెత్తేసిన ఐక్య రాజ్య సమితి.. తీర్మానం వీటో చేసిన రష్యా
రష్యా దళాలు తమ నివాస ప్రాంతాల వద్దకు సమీపించడం, చేతిలో నిత్యావసరాల కొరత ఏర్పడటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఉక్రెనియన్లు దేశం దాటుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాహనాల వరుసలు బార్లు తీరాయి. పొలండ్‌కు వెళ్లే సరిహద్దు వద్ద ఎముకలు కొరికే చలిలోనే కొన్ని గంటలపాటు ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా దేశం వదలి వెళుతున్న బాధితులు మాట్లాడుతూ..‘రష్యన్లు దేశం మొత్తాన్ని ఆక్రమిస్తారని మేం భయపడుతున్నాం. మా మగవారిని నిర్బంధిస్తారని ఆందోళనగా ఉంది’ అంటూ కన్నీటితో తెలిపారు. ఎవా అనే ఓ మహిళ తన ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి హంగరీ చేరుకుంది. అలా ఎంతోమంది మహిళ పరిస్థితి ఇలాగే ఉంది.
చేతిలో పసికందుతో 36 గంటల పాటు ప్రయాణించిన మరో మహిళ మాట్లాడుతూ..‘గురువారం (ఫిబ్రవరి 24,2022)ఉదయం పేలుళ్ల శబ్దం విన్నాం. బాంబులు, రాకెట్లు దూసుకువచ్చాయి. మేం ఎక్కడికీ వెళ్లడానికి లేదు ఏ క్షణంలోఏం జరుగుతుందో తెలియదు..ఎటునుంచి ఏ బాంబు మీద పడుతుందో తెలియదు’ అంటూ వాపోయారు. ఇలా వెళ్తున్నవారికి గమ్యస్థానం అంటూ ఏమీ లేదు. ఎక్కడ సురక్షితంగా ఉంది అంటేఅక్కడికే పోతున్నారు. అలా ఎంతోమంది బాధితులు చర్చిల్లో ఆశ్రయం పొందుతున్నారు.యుక్రెయిన్ బాధితులను ఇతరదేశాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో అక్కున చేర్చుకుంటున్నారు.తమకు తోచిన సహాయంచేస్తున్నారు.సరిహద్దుల్లో తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు.
Also read : Ranji Trophy 2021-22 : కూతురు చనిపోయింది.. బాధను దిగమింగుకుని సెంచరీ చేశాడు, సలామ్ అంటున్న నెటిజన్లు
ఇదిలా ఉంటే.. ఇతరదేశాల్లో ఉన్న యుక్రెనియన్లు తమ దేశానని రక్షించుకోవటానికి తిరిగి వస్తున్నారు. పొలండ్ నుంచి వచ్చిన మికొలజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా దేశాన్ని రక్షించుకోవడానికి మేం తిరిగి వస్తున్నాం. మేం రష్యాకు ఎలాంటి అపకారం చేయలేదు. పుతిన్ మా దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’ మా దేశం కోసం మేం పోరాడతాం..అంటూ తెలిపారు.