Russia Ukraine War : బంకర్‌లోకి యుక్రెయిన్ అధ్యక్షుడు..!

యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి రష్యా బలగాలు చేరుకున్నాయి. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీని బంకర్ లోకి తరలించాయని సమాచారం.

Russia Ukraine War : బంకర్‌లోకి యుక్రెయిన్ అధ్యక్షుడు..!

Bunker

Russia Ukraine War : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలతో రష్యా సేనలు యుక్రెయిన్‌పై భీకరదాడులు చేస్తున్నాయి. వరుసగా రెండో రోజూ యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి రష్యా బలగాలు చేరుకున్నాయి. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీని బంకర్ లోకి తరలించాయని సమాచారం. తమ అధ్యక్షుడిని కాపాడుకునేందుకు భద్రతా దళాలు ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది.

యుక్రెయిన్‌ రాజధాని ఆక్రమణ దిశగా రష్యా వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రష్యా బలగాలు కీవ్‌లోకి ప్రవేశించాయి. కీవ్‌పై వైమానిక దాడులకు రష్యా సిద్ధమైంది. కీవ్‌ గగనతలంలో రష్యా ఎయిర్‌క్రాఫ్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఏ క్షణమైనా కీవ్‌ను సీజ్‌ చేసేందుకు రష్యా రెడీగా ఉంది. 96 గంటల్లో కీవ్‌ను రష్యా ఆక్రమించేసుకుంటుదని యుక్రెయిన్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. యుక్రెయిన్‌ ఆర్మీ పోరాడుతున్నా రష్యా సైన్యాన్ని ఆపలేకపోతోంది.

Russia-Ukraine War : యుద్ధం ఆపేయండి.. పుతిన్‌తో నేరుగా చర్చలకు సిద్ధం.. యుక్రెయిన్ అధ్యక్షుడు

యుక్రెయిన్ పై రష్యా బలగాలు మెరుపు దాడులతో విరుచుకుపడుతున్నాయి. యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రష్యా 203 దాడులు చేసినట్లు యుక్రెయిన్ వెల్లడించింది. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రేడియోధార్మిక వ్యర్ధాల నిల్వలపైనా రష్యా బాంబులు పడ్డాయని యుక్రెయిన్ తెలిపింది. దీంతో రేడియోధార్మికత స్థాయి ఒక్కసారిగా పెరిగిందని వెల్లడించింది. గతంలో దుర్ఘటన తరువాత అణువిద్యుత్ కేంద్రాన్ని యుక్రెయిన్ మూసివేసింది.

Russia-Ukraine War Zelensky taken to bunker as Russian troops approach Kiev

Russia-Ukraine War Zelensky taken to bunker as Russian troops approach Kiev

నాటో దేశాలు ఏదో రూపంలో సాయం చేస్తాయని భావిస్తే ఎవరూ ఇప్పుడు స్పందించడం లేదు. మేమున్నాం నీకెందుకంటూ యుక్రెయిన్‌ను ముందుకు తోసిన దేశాలు ఇప్పుడు జారుకున్నాయి. రష్యా చేసింది తప్పంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి తప్ప ఒక్క దేశం కూడా సైనిక సాయానికి ముందుకు రావడం లేదు.

రష్యా నుంచి వచ్చే గ్యాస్‌పై చాలావరకూ ఆధారపడ్డ యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తున్నాయి తప్ప… సైనిక చర్యలకు ముందుకు రావడం లేదు. ఎక్కడ రష్యాపై దాడికి దిగితే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందో అని ఆందోళన పడుతున్నాయి. దీంతో వీరందరినీ నమ్మి యుద్ధానికి దిగిన యుక్రెయిన్‌ ఇప్పుడు తలపట్టుకుంది.

Russia-Ukraine War : చర్చలకు జెలెన్‌స్కీ ప్రతిపాదన.. ప్రతినిధుల బృందాన్ని పంపేందుకు పుతిన్ రెడీ..!

ప్రపంచదేశాల వెన్నుపోటు పొడిచాయి. నమ్మించి నట్టేట ముంచారని యుక్రెయిన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రపంచం తమను ఒంటరిని చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వాపోయారు. ఎవరిని ఏ సాయం అడిగినా ఎవరూ స్పందించడం లేదన్నారు. చివరకు ప్రజలే రష్యా బలగాలను ఎదుర్కోవాలని పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.