Russian Attack : రష్యా దాడితో పారిపోయిన యుక్రెయిన్‌ సైనికులు

మరోవైపు మిగిలిన నగరాలపైనా రష్యా తన దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. వరుసగా 11వరోజూ కూడా పుతిన్ దళాలు..యుక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దురాక్రమణ చేసే దిశగా కాల్పులకు తెగబడుతున్నాయి.

Russian Attack : రష్యా దాడితో పారిపోయిన యుక్రెయిన్‌ సైనికులు

Attacks

Russian army attacks : కాల్పుల విరమణ తర్వాత రష్యా మరింత దూకుడు పెంచింది. యుక్రెయిన్‌ ఆర్మీ బేస్‌ క్యాంప్‌లపై రష్యా దాడులు చేస్తోంది. ఖేర్సన్‌ ఆర్మీ బేస్‌పై విరుచుకుపడ్డ రష్యా..దాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. రష్యా దాడితో యుక్రెయిన్‌ సైనికులు పారిపోయారు. ఆయుధాలు, యుద్ధ వాహనాలు బేస్‌లోనే వదిలేసి వెళ్లిపోయారు. ఈ మేరకు రష్యా రక్షణశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రష్యా స్వాధీనం చేసుకున్న దాంట్లో ఏకంగా 4 వేల 500 టన్నుల మందుగుండు సామాగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రాకెట్‌ షెల్స్‌ను కూడా రష్యా స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు T-64, T-80 యుద్ధ ట్యాంకులను కూడా రష్యా తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది.

మరోవైపు మిగిలిన నగరాలపైనా రష్యా తన దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. వరుసగా 11వరోజూ కూడా పుతిన్ దళాలు..యుక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దురాక్రమణ చేసే దిశగా కాల్పులకు తెగబడుతున్నాయి. కీవ్ నగరానికి కేవలం కొద్ది దూరంలోనే రష్యా సైన్యం మాటు వేసుకొని ఉన్నట్లు తెలుస్తోంది. యుక్రెయిన్‌ను పూర్తి స్థాయిలో ఆక్రమించే విధంగా రష్యా పావులు కదుపుతున్న రష్యా ఏక్షణంలోనైనా పూర్తి స్థాయి బలగాలతో రాజధానిలోకి ప్రవేశించే అవకాశముంది.

Ukraine Indian Help : యుద్ధం ఆగడానికి భారత్ సాయం కోరిన యుక్రెయిన్.. పుతిన్‌తో మాట్లాడాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి

ఇప్పటికే కీవ్, ఖార్కివ్, సుమీ పలు ప్రాంతాలపై బాంబులు, కిపణులు, రాకెట్‌లతో రష్యా విరుచుకు పడుతోంది. దీంతో యుక్రెయిన్‌లో ఎక్కడ చూసిన బాంబు దాడులకు శిథిలమైన భవనాలు దర్శన మిస్తున్నాయి. యుక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా కీలక ప్రకటన చేసింది. యుక్రెయిన్‌లో తాము సృష్టించిన విధ్వంసంపై రష్యన్‌ ఆర్మీ లెక్కలు విడుదల చేసింది. రష్యన్ బలగాలు జరిపిన దాడుల్లో 90 యుక్రెయిన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయని తెలిపింది.

ఇందులో 21 ఫైటర్‌ జెట్లు ఉన్నాయని.. ఇప్పటి వరకు యుక్రెయిన్‌కు చెందిన 748 యుద్ధ ట్యాంక్‌లు, సైనిక వాహనాలు.. 68 రాడార్ స్టెషన్స్‌.. 2 వేల 119 మిలటరీ బిల్డింగ్‌లు.. 76 రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. 532 మిలటరీ వాహనాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. యుక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత రష్యా ఇలాంటి లెక్కలు విడుదల చేయడం ఇదే తొలిసారి.

Russia : యుక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా కీలక ప్రకటన-90 యుక్రెయిన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 76 రాకెట్ లాంచర్లు ధ్వంసం

ఇప్పటి వరకు రష్యన్ బలగాలను ఎలా మట్టుపెడుతున్నాం.. ఎంతమందిని మట్టుపెట్టామని యుక్రెయిన్‌ అధికారికంగా ప్రకటిస్తూ వచ్చింది. ఓ వైపు యుక్రెయిన్‌ ప్రకటనలు కొనసాగుతుండగానే.. రష్యా తాము చేయాల్సిన పనులు సైలెంట్‌గా చేస్తూ వచ్చింది. కానీ తొలిసారి రష్యన్‌ ఆర్మీ యుక్రెయిన్‌ను ఏ విధంగా దెబ్బతిస్తున్నామని లెక్కలతో సహా వివరించింది. మరోవైపు రష్యా సైన్యం వెన్ను విరుస్తున్నానమని యుక్రెయిన్‌ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తోంది.

రష్యా సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతిసేలా వారికి వార్నింగ్‌లు ఇస్తోంది. ఇప్పటి వరకు 9 వేల 166 మంది రష్యా సైనికులను మట్టుపెట్టినట్టు ప్రకటించింది. 200 యుద్ధ ట్యాంకులను, 800 సైనిక వాహనాలను, 37 అటాక్‌ హెలికాప్టర్లను, 33 ఫైటర్‌ జెట్లను కూల్చేసినట్లు, 2 బోట్లను ధ్వంస యుక్రెయిన్‌ అనౌన్స్‌ చేసింది. 60 ఇంధన ట్యాంకులు, 404 కార్లు, 251 ట్యాంకులను ధ్వంసం ప్రకటించింది.