Selfie Pose Gorilla Ndakasi died : కాపాడినోడి కౌగిలిలోనే కన్నుమూసిన ‘సెల్ఫీ స్టార్ గొరిల్లా’

మనిషితో సెల్ఫీకి ఫోజులిచ్చిన గొరిల్లా కన్నుమూసింది. తనను కాపాడిన వ్యక్తి ఒడిలోనే తుదిశ్వాస విడిచి అందరిని కంటతడిపెట్టిస్తోంది.

Selfie Pose Gorilla Ndakasi died : కాపాడినోడి కౌగిలిలోనే కన్నుమూసిన ‘సెల్ఫీ స్టార్ గొరిల్లా’

Selfie Pose Gorilla Ndakasi Died (1)

Ndakasi Selfie Pose Gorilla No More: మనిషితో సెల్ఫీకి ఫోజులిచ్చిన గొరిల్లా కన్నుమూసింది. తనను కాపాడిన వ్యక్తి ఒడిలోనే తుదిశ్వాస విడిచి అందరిని కంటతడిపెట్టిస్తోంది. సెల్ఫీ స్టార్‌ ఎండకశి..ఇది కొండ జాతికి చెందిన గొరిల్లా. 2019లో తన తోటి గొరిల్లా ఎన్‌డెజెతో కలిసి పార్క్‌ రేంజర్‌ మాథ్యూ షమావూ తీసిన సెల్ఫీకి సీరియస్‌ ఫోజు ఇచ్చి సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. అప్పటి నుంచి ఈ గొరిల్లా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయిపోయింది. దాని ఫోజులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఏం ఫోజు రా బాబూ ఎక్కడ నేర్చుకున్నావ్ ఈ స్టిల్స్ అంటూ ముద్దు ముద్దుగా మెచ్చుకున్నారు. అలా ఎండకశి మీద ఎన్నో మీమ్స్‌ వచ్చాయి. మరెన్నో కథనాలు వచ్చాయి.

Read more : Tiger Died : వేటగాళ్ల ఉచ్చులోపడి పెద్దపులి మృతి

ఈ ఎండకసి డాక్యుసిరీస్‌లలో కూడా కనిపించింది. ఇంత ఫేమస్ అయిన ఈ గొరిల్లా 14 ఏళ్ల వయసులో.. దాని చిన్నప్పటి నుంచి సంరక్షిస్తున్న ఆండ్రే బౌమా కౌగిలిలోనే కన్నుమూసింది..దీని మరణంతో నెటిజన్లు కూడా కంటతడిపెడుతున్నారు. సంరక్షకుడి ఒడిలో పడుకుని చనిపోయిన గొరిల్లా ఫోటో సోషల్ మీడియాల విపరీతంగా వైరల్‌ అవుతోంది. చిన్నపిల్లలా చూసుకున్నా…వీడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అంటూ ఆండ్రే పేరిట ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.అనారోగ్య సమస్యలతోనే ఎండకశి చనిపోయిందని పార్క్‌ నిర్వాహకులు వెల్లడించారు. ఎండకశి కాంగో విరుంగ నేషనల్‌ పార్క్‌లో సెన్‌వెక్వే సెంటర్‌లో ఇంతకాలం పెరిగింది. దాని తల్లి చనిపోవటంతో అది అనాథ అయ్యింది. మరో విశేషం ఏంటంటే..కాంగో విరుంగ నేషనల్‌ పార్క్‌లో సెన్‌వెక్వే సెంటర్‌లో పెరిగే గొరిల్లాలన్నీ దాదాపు అనాథలే. విరుంగ నేషనల్‌ పార్క్‌లో నివసించే గొరిల్లాలను, సాయుధులైన మిలిటెంట్లు కాల్చి చంపుతున్నారు. దీంతో ఎన్నో గొరిల్లాలు అనాథలుగా మారుతున్నాయి.

Read more : Elephant released on parole : హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న

దీంట్లో భాగంగానే ఎండకసి తల్లిని 2007లో మిలిటెంట్లు కాల్చి చంపారు. అప్పటికి ఎండకసికి కేవలం నెలల వయస్సు. తల్లి మరణంతో ఎండకసి అనాథ అయ్యింది. తల్లి కళేబరాన్ని గట్టిగా పట్టుకుని పడుకుని ఉంది. అలా నెలల వయస్సున్న ఎండకసిని పార్క్‌ రేంజర్‌ ఆండ్రే బౌమా గుర్తించాడు. ఆ తరువాత దాన్ని కాపాడాడు. ఇంతకాలం ఆలనా పాలనా చూసుకున్నాడు. చంటిపాపలాగా దాన్ని చూసుకున్నాడు.

అలా తనను కాపాడి సంరక్షించిన ఆండ్రే బౌమా ఒడిలోనే ఎండకసి తుదిశ్వాస విడిచింది. రెండేళ్ల క్రితం ఎర్త్ డే సెల్ఫీకి ఫోజులిచ్చి ఎండకసి వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు దాని మరణంతో ఇంటర్నెట్ లో పలువురు హృదయపూర్వక సంతాపాన్ని తెలుపుతున్నారు.కాగా ఎండకసి తల్లిని చంపేసిన తరువాత కొండ గొరిల్లాలను సంరక్షించేందుకు కాంగో భారీ ఆపరేషన్‌ నిర్వహించింది. ఇది సత్ఫలితం ఇవ్వగా.. 2007లో 720 కొండ గొరిల్లాల సంఖ్య.. ఇప్పుడు ఆ సంఖ్య 1,063కి చేరిందని తెలుస్తోంది.