Tiger Died : వేటగాళ్ల ఉచ్చులోపడి పెద్దపులి మృతి

ములుగు జిల్లాలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని పెద్దపులి హతమైంది. కోడిశాల అటవీ ప్రాంతంలో పెద్దపులి చనిపోయింది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు పెద్దపులి కళేబరం కనబడింది.

Tiger Died : వేటగాళ్ల ఉచ్చులోపడి పెద్దపులి మృతి

Tiger Dead

forest department serious : ములుగు జిల్లాలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని పెద్దపులి హతమైంది. కోడిశాల అటవీ ప్రాంతంలో పెద్దపులి చనిపోయింది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు పెద్దపులి కళేబరం కనబడింది. దీంతో పోలీసులు పెద్దపులి మృతిపై రహస్యంగా విచారణ జరుపుతున్నారు. వేటగాళ్లను తాడ్వాయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

పోలీసులు, ఫారెస్ట్‌ అధికారులు రహస్యంగా విచారిస్తున్నారుపులి చర్మాన్ని, ఎముకలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. కొద్ది నెలలుగా ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి, ములుగు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం వార్తలు వచ్చాయి. ఇప్పుడు పులి మరణ వార్తతో ఆ ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

Leopard : మేకల మందపై చిరుతపులి దాడి…పోరాడి కొడవలితో నరికి చంపిన కాపరి

ములుగు జిల్లాలో పెద్దపులి మృతిపై అటవీశాఖ సీరియస్‌ అయ్యింది. అటవీశాఖ అధికారులు పులి మృతిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. అధికారుల బృందం హైదరాబాద్‌ నుంచి ములుగు చేరుకుంది. వేటగాళ్ల వ్యవహారంపై ప్రత్యేక విచారణ జరుపుతున్నారు. నలుగురు అనుమానితులను విచారిస్తున్నారు.

కొద్ది నెలలుగా ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి, ములుగు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారిస్తోంది. గత మూడు రోజుల క్రితం ఏటూరునాగారం పోలీసులు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ఈ రోజు ప్రవేశపెట్టనున్నారు.

Tiger : ఎలుగుబంటి దెబ్బకు తోకముడిచిన పెద్దపులి

ఛత్తీస్ ఘడ్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి పులి ఏటూరునాగారం అడవుల్లోకి వచ్చింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పులి తిరిగింది. పులి మృతిపై ఫారెస్ట్ అధికారుల బృందం రంగంలోకి దిగింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లోని వేటగాళ్ల సమాచారాన్ని ఫారెస్ట్ పోలీసు అధికారులు సేకరిస్తున్నారు.