Bangladesh : బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం..17మంది మృతి, 35మందికి గాయాలు

బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ప్రయాణికుల బస్సు చెరువులో పడిన ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 17 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి....

Bangladesh : బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం..17మంది మృతి, 35మందికి గాయాలు

Bus Falls Into A Pond

Bangladesh : బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ప్రయాణికుల బస్సు చెరువులో పడిన ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 17 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటం, డ్రైవరు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బంగ్లాదేశ్ పోలీసులు చెప్పారు. (Bangladesh)

Delhi on high alert : యమునా నది నీటిమట్టం మళ్లీ డేంజర్ లెవెల్…ఢిల్లీలో హైఅలర్ట్

పిరోజ్ పూర్ లోని భండారియా నుంచి బారిషల్ బయలుదేరిన బస్సు బరిషల్-ఖుల్నా హైవేపై ఛత్రకాండలోని రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడిపోయింది. (Bus Falls Into A Pond) ఈ బస్సు కెపాసిటీ 52 మంది ప్రయాణికులు కాగా, ఇందులో 60 మంది ఉన్నారు. ఎక్కువ మంది ప్రయాణికులతో ఓవర్ లోడ్ కావడంతో చెరువులో పడిన బస్సు వెంటనే నీటిలో మునిగి పోయింది.

Seema,Sachin Love story : సీమా, సచిన్‌లకు అస్వస్థత…భారత పౌరసత్వం కల్పించాలని రాష్ట్రపతికి లేఖ

ఈ ప్రమాదం నుంచి మోమిన్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 17 మంది అక్కడికక్కడే మరణించారని (Seventeen Killed), మిగిలిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని బరిషల్ డివిజనల్ కమిషనర్ ఎండీ షౌకత్ అలీ చెప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది పిరోజ్‌పూర్‌లోని భండారియా ఉపజిల్లా, ఝల్‌కతీలోని రాజాపూర్ ప్రాంతంలోని నివాసితులని పోలీసులు తెలిపారు.

Bhadrachalam: పెరుగుతున్న గోదావరి వరద

బంగ్లాదేశ్‌లో బస్సు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ఈ ఏడాది జూన్‌నెలలో మొత్తం 559 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 562 మంది మరణించగా, మరో 812 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా 207 మోటార్‌సైకిల్ ప్రమాదాల్లో 169 మంది మరణించారు. బంగ్లా జలమార్గాల్లో 9 మంది మరణించగా మరో ఏడుగురు గల్లంతు అయ్యారు.

Amazon Employees : అమెజాన్ కొత్త వర్క్ పాలసీ.. వస్తే రండి.. పోతే పోండి.. వారంలో 3 రోజులు ఆఫీసులో పనిచేయాల్సిందే..!

21 రైలు ప్రమాదాల్లో 18 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాల్లో 38 జంతువులు మరణించాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో 99 మంది పాదచారులు కూడా మరణించారు. మొత్తం మీద బంగ్లాదేశ్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.