US : అమెరికాలో మరోసారి పేలిన గన్..చికాగోలో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు..ఆరుగురు మృతి

అమెరికాలోని చికాగోలో సోమవారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో 36మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

US : అమెరికాలో మరోసారి పేలిన గన్..చికాగోలో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు..ఆరుగురు మృతి

Gun Firing In Us Chicago

gun firing in Us Chicago : అమెరికాలోని చికాగోలో సోమవారం (7,2022)నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో 36మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర చికాగో శివారులోని హైలాండ్ పార్క్‌లో జరిగిన పరేడ్‌పై అత్యంత శక్తిమంతమైన రైఫిల్‌తో ఓ వ్యక్తి పైకప్పు నుంచి కాల్పులు జరిపాడు.ఈ ఘటనకు సంబంధించి గత రాత్రి రాబర్ట్ ఇ క్రిమో అనే వ్యక్తిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు క్రిమోపై పలు అభియోగాలు ఉన్నాయని హైలాండ్ పార్క్ పోలీసులు తెలిపారు.

ప్రశాంతంగా జరుగుతున్న పరేడ్‌పై ఒక్కసారిగా కాల్పులు జరగడంతో జనం భయంతో పరుగులు తీశారు. అక్కడ ఏం జరిగిందో తెలియని స్థితిలో అటూ ఇటూ పరుగులు తీశారు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి అయిన రిచర్డ్ కౌఫ్‌మన్ అనే రిటైర్డ్ డాక్టర్ మాట్లాడుతూ..ఏం జరిగిందో తెలియదు గానీ పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తున్నంతస్థాయిలో శబ్దాలు వచ్చాయని దాదాపు 200 షాట్లు వినిపించాయని తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీశారని తెలిపారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also read : US Anti Gun : తుపాకి నియంత్రణ చట్టంపై సంతకం చేసిన బైడన్..బిల్లుకు లభించిన ఆమోదం

కాగా అమెరికాలో గన కల్చర్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకురావటానికి అధ్యక్షుడు జో బైడన్ కొన్ని రోజుల క్రితం సంతకం పెట్టిన విషయం తెలిసిందే. టెక్సాస్‌ స్కూల్‌ కాల్పుల ఘటన తర్వాత.. యూఎస్‌లో గన్ కల్చర్ కట్టడి చేయాలని డిమాండ్‌ వినిపించింది. అధ్యక్షుడు బైడెన్ కూడా అదే అన్నారు. అమెరికన్ల ఉసురుతీస్తున్న ఆయుధానికి ఒక్క సంతకంతో చెక్‌ పెట్టారు అధ్యక్షుడు బైడన్. టెక్సాస్‌లో పారిన చిన్నారుల నెత్తురు సాక్షిగా తుపాకి సంస్కృతిని తుదముట్టిద్దామని పిలుపునిచ్చిన బైడన్ చెప్పినట్టుగానే ఆయుధం అరాచకానికి చరమగీతం పాడేందుకు కీలక అడుగు వేశారు. కొన్ని దశబ్దాలుగా అమెరికన్లకు నెరవేరని కలలా ఉన్న తుపాకి నియంత్రణ చట్టానికి ఆమోద ముద్ర వేశారు. అయినా అమెరికాలో ఇంకా కాల్పుల మోత మోగుతునే ఉంది. ఈ క్రమంలో మరోసారి గన్ పేలింది. ఆరుగురి ప్రాణాలు బలిగొంది.