“Sat Sri Akaal” : సిక్కుల తలపాగా ధరించిన సింగ‌పూర్ ప్ర‌ధాని..పంజాబీ భాషలో పలుకరింపు

సింగపూర్ ప్రధాని లీ సెన్ లూంగ్ భారత్ లో సిగ్గులు ధరించే తలపాగా ధరించారు. సింగ‌పూర్‌లో గురుద్వారా ప్రారంభోత్స‌వంలో పాల్గొన్న ప్ర‌ధాని లీ హ్సేన్ లూంగ్ ..సిక్కుల‌ త‌ల‌పాగాను ధ‌రించారు. ఆ ధరించిన తెల్లటి తలపాగా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘స‌త్ శ్రియాకాల్’ అంటూ పంజాబీ భాష‌లో సిక్కుల‌కు శుభాకాంక్షలు తెలిపారు.

“Sat Sri Akaal” : సిక్కుల తలపాగా ధరించిన సింగ‌పూర్ ప్ర‌ధాని..పంజాబీ భాషలో పలుకరింపు

Singapore Pm Wears Turban

Singapore PM Wears Turban : సింగపూర్ ప్రధాని లీ సెన్ లూంగ్ భారత్ లో సిగ్గులు ధరించే తలపాగా పెట్టుకున్నారు. సింగ‌పూర్‌లో గురుద్వారా ప్రారంభోత్స‌వంలో పాల్గొన్న ప్ర‌ధాని లీ హ్సేన్ లూంగ్ ..సిక్కుల‌ త‌ల‌పాగాను ధ‌రించారు. ఆ ధరించిన తెల్లటి తలపాగా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘స‌త్ శ్రియాకాల్’ అంటూ పంజాబీ భాష‌లో సిక్కుల‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సిల‌త్ రోడ్డులో ఉన్న గురుద్వారాను ఇటీవ‌ల పున‌రుద్ద‌రించిన సందర్భంగా..జరిగిన గురుద్వారా ప్రారంభోత్స‌వంలో ప్రధాని మాట్లాడుతూ..ఈ కరోనా కష్టకాలంలో మహమ్మారి విజృంభించిన విప‌త్క‌ర స‌మ‌య‌ల్లో జాతి, మ‌త వివ‌క్ష లేకుండా సిల‌త్ గురుద్వారా అనేక మందిని ఆదుకుందని ప్ర‌ధాని లీ తెలిపారు. ఈ సందర్భంగా సిక్కుల చేసిన కృషిని ప్రశంసించారు. సిలట్ రోడ్ గురుద్వార సింగపూర్ మల్టీపుల్ మత ప్రకృతి దృశ్యంలో మెరుస్తున్న చిహ్నం అని ప్రధాని అన్నారు.

ఈ సేవా కార్యక్రమాలు విస్తృత సమాజానికి మంచి ఉదాహరణగా నలిచాయన్నారు. వీరు చేసిన సేవలు ప్రశంసనీయమని..కరోనా వైరస్ ను ఎదుర్కొని సాధారణ జీవితంలోయి పయనించటానికి గురుద్వార సేవలు తోడ్పడ్డాయని అన్నారు.పున‌ర్ నిర్మాణ ప‌నుల స‌మ‌యంలో గురుద్వారా పెద్ద‌లు స‌హ‌క‌రించిన తీరు పట్ల ప్ర‌ధాని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సిక్కు వ‌ర్గంలో మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతున్న‌వారికి ప్రాజెక్టు అకాల్‌తో స్వాంతన చేకూరుతోందని తెలిపారు. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ అకౌంట్ల‌లో ఆయ‌న సిక్కులు చేసిన సేవాకార్యక్రమాల ఫోటోల‌ను పోస్టు చేశారు.