Menstrual leave: మహిళలకు మూడు రోజులు 'రుతుక్రమ' సెలవు ప్రకటించిన మొట్టమొదటి దేశం | Spain could become the first European country to offer three day menstrual leave for Women

Menstrual leave: మహిళలకు మూడు రోజులు ‘రుతుక్రమ’ సెలవు ప్రకటించిన మొట్టమొదటి దేశం

స్పెయిన్ దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ప్రతినెలా రుతుక్రమ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Menstrual leave: మహిళలకు మూడు రోజులు ‘రుతుక్రమ’ సెలవు ప్రకటించిన మొట్టమొదటి దేశం

Menstrual leave: రుతుక్రమ(Menstrual Periods) సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పాశ్చాత్య దేశాల్లో అయితే రుతుక్రమం గురించి బహిరంగంగానే చర్చలు జరుగుతున్నా, కొన్ని సాంప్రదాయ పద్ధతులున్న దేశాల్లో మాత్రం ఇప్పటికీ ఇది చర్చకు రాని అంశంగానే ఉండిపోయింది. ప్రతి నెలా ఈ రుతుక్రమాన్ని ఎదుర్కొనే మహిళలు, ఆ సమయంలో ఎంతో శారీరక, మానసిక ఒత్తిడికి గురౌతుంటారు. ఇది ఆందోళనకరమైన విషయంగా భావించాలి. ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని స్పెయిన్ దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ప్రతినెలా రుతుక్రమ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోనే ఒక నెలలో మహిళలకు మూడు రోజుల పాటు ఇలా బహిష్టు సెలవులు ప్రకటించిన మొట్టమొదటి దేశం స్పెయిన్ కావడం గమనార్హం. ఈమేరకు పునరుత్పత్తి ఆరోగ్యం మరియు అబార్షన్ హక్కులపై రూపొందించిన రెగ్యులేషన్ బిల్లు డ్రాఫ్ట్ కాపీని సిద్ధం చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ బిల్లు స్పెయిన్ పార్లమెంటులో ఆమోదం పొందనుంది.

Other Stories: wheat export: గోధుమ ఎగుమతులపై భారత్ నిషేధం

స్పానిష్ గైనకాలజీ మరియు ప్రసూతి శాస్త్ర సంఘం నివేదించిన వివరాల ప్రకారం ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు రుతుక్రమ సమయంలో తీవ్రమైన నొప్పితో భాదపడుతున్నారు. డిస్మెనోరియాగా పిలిచే ఈరకమైన నొప్పి కారణంగా రుతుక్రమ కలిగించే కాలానికి ముందు లేదా ఆ సమయంలో మహిళల్లో అసౌకర్యం, తలనొప్పి, వికారం, వాంతులు, అలసట మరియు విరేచనాలు ప్రారంభమయ్యే పరిస్థితిని సూచిస్తుంది. సాధారణ వ్యాధుల సమయంలో ఉద్యోగులు సెలవు తీసుకున్నట్టుగానే..రుతుక్రమ సమస్యలు కూడా మహిళల్లో ఆందోళన స్థాయి పెంచుతున్నాయని, ఈసమయంలో వారికీ గరిష్ట నిద్ర అవసరమని భావించి బహిష్టు సెలవుల ప్రతిపాదన తెచ్చినట్టు స్పెయిన్ రాష్ట్ర సమానత్వం మరియు లింగ స్వేచ్ఛ కార్యదర్శి ఏంజెలా రోడ్రిగ్జ్ పేర్కొన్నారు.

Other Stories: Kim Jong un: కరోనా ఎఫెక్ట్.. మొదటిసారి మాస్క్‌ ధరించిన కిమ్.. ఉత్తర కొరియాలో కరోనా విలయం..

భారతదేశం, జపాన్, తైవాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా మరియు జాంబియా వంటి దేశాలు బహిష్టు సెలవులను ప్రకటించాయి. అయితే అవి పూర్తిగా బహిష్టు సెలవులుగా పరిగణించబడలేదు. అనారోగ్య, వ్యక్తిగత సెలవులుగానే పరిగణిస్తున్నారు. భారతదేశంలో, మహిళలకు ఋతుస్రావం సెలవులు పొందడానికి చట్టబద్ధమైన హక్కు లేదు. అయితే పీరియడ్స్ సమయంలో రెండు రోజుల సెలవులను మహిళలు తీసుకోవచ్చని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రుతుక్రమ బెనిఫిట్ బిల్లు, 2017ను మొదటిసారిగా లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లుగా అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్ (పశ్చిమ) ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్ ప్రవేశపెట్టారు. 2022 రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున అదే బిల్లును ఎమ్మెల్యే ప్రవేశపెట్టాడు. అయితే ఇతర శాసనసభ్యులు ఈ బిల్లు అంతగా పరిగణించాల్సిన విషయం కాదంటూ కొట్టిపారేశారు.

Other Stories:Moon Soil Plant: చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కల పెంపకం విజయవంతం

×