BUS Accident : ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది ప్రయాణికులు మృతి.. మరికొందరికి గాయాలు
BUS Accident : ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15మంది ప్రయాణికులు మరణించగా.. 19మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను
BUS Accident
BUS Accident : ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15మంది ప్రయాణికులు మరణించగా.. 19మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also read : Government Employees : ఆఫీసులకు అలా రావొద్దు.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ
ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రావిన్సులోని సెమరాంగ్ నగరంలోని క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలి వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పదిహేను మంది ప్రయాణికులు మరణించగా.. 19మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
సెమరాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ అధికారుల వివరాల ప్రకారం.. ప్రమాదం సమయంలో ప్యాసింజర్ బస్సు అధిక వేగంతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించామని, బస్సు వేగంగా వెళ్లే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొట్టాడని తెలిపారు. ప్రమాదం కారణంగా కొంతమంది ప్రయాణికులు బస్సు లోపలే ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
రెస్క్యూ సిబ్బంది బోల్తా పడిన బస్సులోకి వెళ్లి.. క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చారు. వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు బస్సు ప్రమాదం ఘటనపై స్థానిక అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
