Spanx company Sara Blakely : లాభాల్లో ఉద్యోగులకు వాటా ఇచ్చిన లేడీ బాస్.. ఒక్కో ఉద్యోగికి రూ.7.5లక్షలు గిఫ్ట్‌

తన కంపెనీకి వచ్చిన లాభాల్లో ఉద్యోగులకు సర్ ప్రైజ్ గిఫ్టు ఇచ్చి ఆనందంలో ముంచెత్తింది స్పాంక్స్‌ కంపెనీ లేడీ బాస్‌ పేరు సారా బ్లేక్లీ.ఒక్కో ఉద్యోగికి రూ.7.5లక్షలు గిఫ్ట్ తో ఖుషీ..

Spanx company Sara Blakely : లాభాల్లో ఉద్యోగులకు వాటా ఇచ్చిన లేడీ బాస్.. ఒక్కో ఉద్యోగికి రూ.7.5లక్షలు గిఫ్ట్‌

Spanx Company Boss Sara Blakely

Spanx company boss Sara Blakely : సాధారణంగా సమాజంలో మూడు రకాల బాస్‌లుంటారు. ఒకరు మంచివారు. ప్రతిభావంతులను గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహిస్తారు. మరికొందరు బాస్‌లు ఉంటారు.. వీరికి ఉద్యోగి ఎంత బాగా పని చేసినా సంతృప్తి ఉండదు. ఏదో విధంగా వారిని ఇబ్బందిపెడుతూనే ఉంటారు. ఇక మూడో రకం బాస్‌లు.. వీరు నూటికో కోటికో ఒక్కరు. ఈ కోవకు చెందిన బాస్‌లు ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లానే చూస్తారు. కష్టనష్టాల్లో వారికి తోడుగా ఉంటారు. కంపెనీ లాభాల్లో ఉద్యోగులకు సమాన వాటా కల్పిస్తారు.

ఆడవాళ్లకు అసూయ ఎక్కువని..సాటి ఆడవాళ్ల కష్టాలు పట్టించుకోరని నిందలు సమాజంలో సర్వసాధారణంగా మారిపోయాయి. ఉదాహరణలు చెప్పాలంటే ఆడవాళ్ల మాట తీయకుండా బహుశా ఎటువంటి పోలికలు ఉండవన్నట్లుగా ఉంటుంది. ఇంతకీ ఈ ఆడవారి మాటలెందుకు? అంటే ఓ మహిళా బాస్ తన ఉద్యోగుల విషయంలో చూపించిన పెద్ద మనస్సు గురించి తెలియాలి కాబట్టి. ఉద్యోగుల కష్టంతో లాభాలు గడించే చాలా కంపెనీలు డా ఉద్యోగులకు లాభాల్ని పంచదు. కనీసం బోనస్ కూడా ఇవ్వవు మరికొన్ని కంపెనీలు. కానీ ఈ లేడీ బాస్ అలా కాదు. నా ఉద్యోగులు కూడా లాభాల్లో భాగస్వామ్యులే అనుకుంది. అలా ఉద్యోగులందరికి తన కంపెనీ లాభాలన్ని పంచిపెట్టి ‘అమ్మ’మనస్సుకు నిదర్శం అని అనిపించుకుంది. మరి ఆ అమ్మలాంటి లేడీ బాస్ విషయాలేంటో ఉద్యోగులకు ఆమె ఏం చేసిందో తెలుసుకుందాం..

Read more : 3 Day Work Week: ఆ కంపెనీ ఉద్యోగులకు వారానికి మూడే వర్కింగ్ డేస్..

స్పాంక్స్‌ కంపెనీ లేడీ బాస్‌ పేరు సారా బ్లేక్లీ. ఇక ల్యాడ్‌బైబిల్‌ ప్రకారం..పెట్టుబడి సంస్థ బ్లాక్‌స్టోన్ స్పాంక్స్‌ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన తర్వాత సారా బ్లేక్లీ కంపెనీకి లాభాలు భారీగా వచ్చి పడ్డాయి. దీంతో సారా సంతోషానికి హద్దులు లేవు. ఆ లాభాలు తన కృషితోనే రాలేదు. దీనికి తన ఉద్యోగులు కూడా కారణమే అనే విషయాన్ని ఆమె మర్చిపోలేదు. తన కంపెనీకి లాభాలు వచ్చాయని తెలిసిన వెంటనే ఆమెకు గుర్తుకు వచ్చేది ఆమె ఉద్యోగులే. అది సారా బ్లేక్లీ పెద్ద మనస్సుకు నిదర్శనం.తన కంపెనీకి వచ్చిన లాభాల మొత్తాన్ని తానే వాడుకుండా..కంపెనీ ఉద్యోగులందరికి వాటాలు ఇచ్చి తన పెద్ద మనస్సుని చాలుకుంది. అలా సారా తన కంపెనీ లాభాలు సంపాదించిన శుభ సందర్భంలో ఉద్యోగులందరికి పార్టీ ఇచ్చింది సారా.

ఇక పార్టీలో ఉద్యోగులందరికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సందర్భంగా సారా తన ఉద్యోగులతో మాట్లాడుతు..“నేను మీకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకుంటున్నాను..మన కంపెనీ లాభాల్లో మీకు వాటా ఇవ్వాలని నిర్ణయించాను..దాంట్లో భాగాంగా మీలో ప్రతి ఒక్కరికీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయటానికి 10 వేల డాలర్లు విలువ చేసే ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు ఇవ్వాలనుకుంటున్నాను. టికెట్‌ వద్దు అనుకున్నవారికి అది డబ్బుల రూపంలో తీసుకోవచ్చు’’ అని పార్టీలో ప్రకటించింది. అంతే ఉద్యోగులంతా తమ బాస్ చెప్పిన మాటల్ని నమ్మలేకపోయారు. కానీ అది నిజమేనని తెలిసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

Read more : Rolls-Royce car gift. : భార్యకు బర్త్‌డే గిఫ్ట్ గా రూ.3.24కోట్ల రోల్స్ రాయిస్ కారు

ఈ సందర్భంగా సారా మాట్లాడుతు..”నా కంపెనీలో ప్రతి ఉద్యోగి ఈ ఆనంద క్షణాల్ని మనసారా ఆస్వాదించాలని నేను అనుకున్నాను..మనమంతా పడిన కష్టానికి వచ్చిన ప్రతిఫలాన్ని అందరం సమానంగా పంచుకుందాం…ఈ సందర్భాన్ని మీరంతా జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. అందుకే మీకు ఈ గిఫ్ట్‌’’ అని ప్రకటించింది సారా. ఈ వార్త విని అక్కడ ఉన్న ఉద్యోగులు సంతోషంతో ఎగిరి గంతేశారు. కొందరు ఆనందం ఎక్కువయ్యి ఏడ్చాసారు కూడా.ఎందుకంటే బాధ వచ్చినా. సంతోషం వచ్చిన వచ్చేది ఏడుపే. సారా ఉద్యోగుల సంతోషాల వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. సారాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజనులు. అమ్మలాంటి మనస్సుని చూపించిన లేడీ బాస్ అంటు ప్రశంసిస్తున్నారు.

Read more : Rolls-Royce car gift. : భార్యకు బర్త్‌డే గిఫ్ట్ గా రూ.3.24కోట్ల రోల్స్ రాయిస్ కారు