Sputnik-V వ్యాక్సిన్ పై రష్యా కీలక ప్రకటన

  • Published By: madhu ,Published On : November 25, 2020 / 09:17 AM IST
Sputnik-V వ్యాక్సిన్ పై రష్యా కీలక ప్రకటన

Sputnik V vaccine Covid-19 : ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్‌ గురించి ఆతృతగా ఎదురు చూస్తోండగా.. తాజాగా వ్యాక్సిన్‌పై రష్యా కీలక ప్రకటన చేసింది. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ 95 శాతం సమర్థంగా పనిచేస్తోందని ప్రకటించింది.. తొలి డోస్‌ ఇచ్చిన 42 రోజుల తర్వాత ఫలితాలను విశ్లేషించామని.. వాటన్నింటిని పరిశీలించాక వ్యాక్సిన్‌ 95 శాతం మెరుగ్గా పని చేస్తోందని తెలిపింది.



రష్యాలో గమలేయా నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. కరోనా వచ్చిన తొలినాళ్లలోనే చాలా త్వరగా ప్రయోగాలు చేపట్టి స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను రూపొందించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తిన రష్యా.. మరోసారి మెరుగైన ఫలితాలను సాధించి వ్యాక్సిన్‌ రేసులో ముందున్నామని ప్రకటించింది.. మరికొన్ని రోజుల్లో రష్యా మరింత మెరుగైన ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.



https://10tv.in/key-information-about-the-effective-covid-19-vaccines/
ఆగస్టులోనే వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిన రష్యా… వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడం మాత్రమే కాదు.. ధరల విషయంలో కూడా స్పుత్నిక్‌-వీ అందుబాటులో ఉంచుతామని తెలిపింది. మిగతా టీకాల కంటే తమ వ్యాక్సిన్‌కు చాలా తక్కువ ధర ఉంటుందని ఇప్పటికే ఆసక్తికర ప్రకటన చేసింది. మరోవైపు భారత్‌లో ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ ప్రయోగాలు ఈ వారంలోనే ప్రారంభం కానున్నాయి. మ‌నుషుల‌పై ప్రయోగాలు చేయ‌డానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామ‌ని అధికారులు వెల్లడించారు. ఇండియాలో ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయ‌ల్స్ రెండింటినీ క‌లిపి చేయ‌నున్నట్లు తెలిపారు.