Squirrel Attack 18 people: ఉడతే కదాని ఊరుకుంటే 18 మందిని ఆసుపత్రికి పంపింది

ఒక బుల్లి ఉడత.. 18 మందిని గాయపరిచింది. నమ్మలేకున్నా ఇది నిజం.

Squirrel Attack 18 people: ఉడతే కదాని ఊరుకుంటే 18 మందిని ఆసుపత్రికి పంపింది

Squirel

Squirrel Attack 18 people: ఉడత.. సైజు ఎంతఉన్న.. దాని పనులు మాత్రం సైజుకి మించి ఉంటాయి. ఉడతే కదాని తీసిపారేయకండి, చరిత్రలో దానికి కూడా ఒక పేజీ ఉంది. ప్రస్తుత విషయానికి వస్తే ఒక బుల్లి ఉడత.. 18 మందిని గాయపరిచింది. నమ్మలేకున్నా ఇది నిజం. ఇంగ్లాండ్ లోని వేల్స్ ప్రావిన్స్ లోని బక్లీ గ్రామంలో డిసెంబర్ 25 క్రిస్టమస్ వేడుకలకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎందుకంటే ఎక్కడ తమపై ఉడత దాడి చేస్తుందోనని. వినడానికి విడ్డురంగా ఉన్నా ఇది నిజం. బక్లీ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఒక ఉడత.. ప్రజలపై, జంతువులపై దాడి చేస్తుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మనుషులను వెంటపడిమరీ కరుస్తుంది. స్థానికులు దానికి “Stripe”గా నామకరణం చేసారు.

ఇది ఎంతలా మారిందంటే.. బక్లీ గ్రామ కమ్యూనిటీ ప్రజలు ఒక ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేసి ఆ ఉడత గురించి సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారు. కుక్క, పిల్లి ఇలా పెంపుడు జంతువులపై కూడా “Stripe” దాడి చేసింది. దాని పదునైన పళ్లతో మనుషుల కాళ్ళను, చేతి వేళ్లను, చెవులను కొరికింది. దీంతో బెంబేలెత్తిన గ్రామస్తులు పండుగ కూడా జరుపుకోకుండా ఇళ్లలోనే ఉండిపోయారట. దీని భారిన పడి.. 18 మందిలో సగం మంది ఆసుపత్రికి కూడా వెళ్ళివచ్చారంట. ఈ ఉడత బ్రతికి ఉండగా క్రిస్టమస్ జరుపుకునే అవకాశం లేదంటూ గ్రామస్తులు ఏకరువుపెట్టుకున్నారు. దీంతో ఎలాగైనా ఉడతను పట్టుకోవాలని భావించిన బక్లీ గ్రామస్తులు, దాని బలహీనతను కనిపెట్టారు.

Also read: Indian Military in 2021: 2021లో భారత మిలిటరీలో జరిగిన 11 ప్రమాదాలు

వేరుశెనగ కాయలు, పల్లీ గింజలను “Stripe” ఇష్టంగా తింటుందని స్థానిక యువతీ ఒకరు గమనించారు. ఇదే విషయాన్నీ గ్రామస్తులతో పంచుకోగా.. వారు ఒక ఉపాయం ఆలోచించారు. ఒక బోను ఏర్పాటు చేసి అందులో పల్లీ గింజలు ఉంచారు. ఆ గింజలు తినేందుకు వచ్చిన ఉడత.. అందులో చిక్కుకోగా.. దాన్ని అధికారులకు అప్పగించారు. అక్కడి చట్టాల ప్రకారం బూడిద రంగులో ఉన్న ఉడతను ఒక్కసారి పట్టుకుంటే దాన్ని తిరిగి అడవుల్లో వదలకూడదు. అందుకే అక్కడి అధికారులు దాన్ని చంపేశారు. బుల్లి ఉడత కధ ఇలా విషాదాంతంగా ముగియడంతో స్థానికులు సైతం విచారం వ్యక్తం చేసారు

Also Read: Tiger Population 2021: భారత్ లో ఆందోళనకర స్థాయిలో పెద్ద పులుల మృత్యువాత