శ్రీలంక ఢిఫెన్స్ సెక్రటరీ రాజీనామా

  • Published By: venkaiahnaidu ,Published On : April 26, 2019 / 01:24 AM IST
శ్రీలంక ఢిఫెన్స్ సెక్రటరీ రాజీనామా

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ ఆదివారం(ఏప్రిల్-21,2019) జరిగిన ఆత్మాహుతి పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం(ఏప్రిల్-25,2019)రాజీనామా చేశారు. నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ దాడులను నివారించలేకపోయిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పోలీస్‌ చీఫ్, రక్షణ శాఖ సెక్రటరీని రాజీనామా చేయాలని ఆదేశించారు.

రాజీనామా చేసిన అనంతరం ఫెర్నాండో  మాట్లాడుతూ…నా వైపు నుంచి ఎటువంటి ఫెయిల్యూర్ లేదు. ఢిఫెన్స్ సెక్రటరీగా నా ఆధ్వర్యంలో పని చేస్తున్న కొన్ని సంస్థల ఫెయిల్యూర్స్ కి నేను బాధ్యత వహిస్తున్నాను. ఉగ్రదాడులుపై నిఘూ వర్గాలు చేసిన హెచ్చరికలపై సెక్యూరిటీ ఫొర్సెస్ యాక్టివ్ గా స్పందించాయని ఆయన తెలిపారు. శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటివరకు 359మంది చనిపోగా 500మంది పైగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.