Chines Population: చైనాలో యువ జంటలకు సబ్సిడీలు.. జననాల రేటును పెంచేలా డ్రాగన్ చర్యలు

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో క్రమంగా జననాల రేటు తగ్గిపోతుంది. 2025 నాటికి దేశంలో జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో జననాల సంఖ్యను పెంచేలా డ్రాగన్ చర్యలు చేపట్టింది.

Chines Population: చైనాలో యువ జంటలకు సబ్సిడీలు.. జననాల రేటును పెంచేలా డ్రాగన్ చర్యలు

Third-child policy in china

Chines Population: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో క్రమంగా జననాల రేటు తగ్గిపోతుంది. 2025 నాటికి దేశంలో జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో జననాల సంఖ్యను పెంచేలా డ్రాగన్ చర్యలు చేపట్టింది. సంతానోత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఎక్కువ మంది పిల్లలను కనేలా యువ జంటలను ప్రోత్సహిస్తూ ప్రత్యేక పన్ను రాయితీలు, సబ్సిడీలు కల్పించేందుకు చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో చైనా ప్రభుత్వంలోని 17 విభాగాలు మంగళవారం సంయుక్తంగా గృహ, ఉపాధి, విద్య, ఇతర రంగాల్లో కల్పనకు మద్దతు ఇవ్వాలని, సబ్సిడీలు, పన్ను రాయితీలు, మెరుగైన ఆరోగ్య బీమా అందించాలని జాతీయ ఆరోగ్య కమిషన్ తాజాగా నూతన మార్గదర్శకాలను జారీచేసింది.

Delhi Covid-19 Cases: ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు

ప్రతి జంట కేవలం ఒకే బిడ్డను కనాలన్న నిబంధనకు చైనా ప్రభుత్వం 2016లో స్వస్తి పలికింది. గతేడాది నుండి ముగ్గురు పిల్లలను కలిగి ఉండేలా కుటుంబ నియంత్రణ విధానాన్ని అమలు చేస్తుంది.  పిల్లల సంరక్షణ సేవల కొరతను తగ్గించేందుకు గాను ఈ ఏడాది చివరి నాటికి చిన్నారుల కోసం తగినన్ని నర్సరీలు ఏర్పాటు చేయాలని జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. అధిక సంతానం దిశగా మహిళలను ప్రోత్సహించేందుకుగాను ఇప్పటికే అక్కడి సంపన్న నగరాలు వారికి పన్ను రాయితీలు, గృహ రుణాలు, విద్యా ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. ఇటువంటి చర్యలను అమలు చేసేందుకు అన్ని ప్రావిన్సులూ ముందుకు రావాలని జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది.

Rajasthan: రాజస్థాన్‌లో పశువులకు వింత వ్యాధి.. 18వేల మూగ జీవాలు మృతి

పెకింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లియాంగ్ జియాన్‌జాంగ్ మాట్లాడుతూ.. ప్రతి నవజాత శిశువుకు 1 మిలియన్ యువాన్ ($155,499) ఇవ్వాలని సూచించారు. ఇది ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీసింది చైనాలో జననాల రేటును ప్రస్తుత 1.3 నుండి 2.1 రీప్లేస్‌మెంట్ స్థాయికి పెంచడానికి, జననాలను ప్రోత్సహించడానికి చైనా తన జీడీపీలో 10 శాతం ఖర్చు చేయవలసి ఉందని లియాంగ్ చెప్పారు. తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌లోని వెన్‌జౌలోని లాంగ్వాన్ జిల్లాలో రెండవ బిడ్డ ఉన్న కుటుంబాలకు 1,000 యువాన్ల నెలవారీ భత్యాన్ని, మూడవ బిడ్డ ఉన్న కుటుంబాలకు 3,000 యువాన్‌లతో పిల్లలకు మూడు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అందించాలని యోచిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.