Suez Canal crisis: ఆకాశంలో చుక్కలు కాదు సముద్రంలో షిప్‌లు.. సూయజ్ కాలువపై భారీగా ట్రాఫిక్ జామ్

రద్దీ రోడ్ మీద బైక్ ఆగిపోతేనే ట్రాఫిక్ జామ్ అయిపోయి గంటలకొద్దీ సమయం రోడ్ నిండిపోతుంది. అప్పటికీ రోడ్ మధ్య గ్యాప్ లలో బైక్ పోనిచ్చేసి వీలైనంత దూరం ముందుకు పోతుంటారు. మరి నీటి మీద..

Suez Canal crisis: ఆకాశంలో చుక్కలు కాదు సముద్రంలో షిప్‌లు.. సూయజ్ కాలువపై భారీగా ట్రాఫిక్ జామ్

Suez Canal Ship

Suez Canal crisis: రద్దీ రోడ్ మీద బైక్ ఆగిపోతేనే ట్రాఫిక్ జామ్ అయిపోయి గంటలకొద్దీ సమయం రోడ్ నిండిపోతుంది. అప్పటికీ రోడ్ మధ్య గ్యాప్ లలో బైక్ పోనిచ్చేసి వీలైనంత దూరం ముందుకు పోతుంటారు. మరి నీటి మీద ట్రాఫిక్ జాం అయితే.. పరిస్థితేంటి. అటు ఇటు గ్యాప్ లేనంతగా సూయెజ్ కాలువపై MV evergreen అడ్డంగా ఇరుక్కుపోయింది.

ప్రతిరోజూ 10 లక్షల బ్యారెల్స్‌ ఆయిల్‌ సరఫరా కెనాల్ ద్వారా కొనసాగుతుంది. ప్రస్తుతం షిప్ చిక్కుకున్న‌ కారణంగా గంటకు సుమారు 3వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు.

Suez 1

Suez 1

సూయజ్ కెనాల్ మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం మధ్య వారధిలాగా పనిచేస్తోంది. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం, నార్తర్న్ హిందూ మహా సముద్రం మధ్య నేరుగా ప్రయాణించడానికి వీలుగా మారింది. దీని నిర్మాణంతో రెండు ఖండాల మధ్య ప్రయాణ దూరం ఏకంగా 8వేల 900 కి.మీ.లు తగ్గిపోయింది. 120 మైళ్ల పొడవు ఉండే సూయజ్ కెనాల్ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జలమార్గం.

Suez 2

Suez 2


ఇలాంటి చోట్ల భారీ నౌక ఇరుక్కుపోవడంతో ప్రపంచ వ్యాపారంపై ప్రభావం పడుతోంది. అరబ్ దేశాల నుంచి చమురు వెళ్ళాలంటే ఇదే సరైన మార్గం. గల్ఫ్ దేశాల నుంచి అమెరికాకు సముద్రయానం, సరుకు రవాణాకు ఇదే మార్గాన్ని వాడతారు. చైనా-నెదర్లాండ్స్‌ మధ్య జరిగే సరుకు రవాణాకు సూయజ్ కెనాలే కీలక మార్గం.

Suez 3

Suez 3


ప్రస్తుతం సూయజ్ కాలువలో అల్ట్రా లార్జ్‌ కంటైనర్‌ షిప్‌ ఇరుక్కుపోయింది. పెను గాలులతో పక్కకు తప్పుకుపోవడంతో ఇలా జరిగింది. ఒక్కసారిగా కెనాల్‌పై అడ్డంగా తిరిగి ఇరుక్కుపోయింది ఈ షిప్. నౌకను తిరిగి యథాస్థితికి తెచ్చి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Suez 4

Suez 4

ఆ మార్గానికి రెండు వైపులా ఎన్నో సరకు రవాణా ఓడలు ఆగిపోయాయి. ఈ ఎవర్ గ్రీన్ షిప్‌ను తైవాన్‌లో తయారు చేశారు. పనామాలో రిజిస్టర్‌ చేశారు. ఆ నౌకలో వందలాదిగా కంటైనర్‌లు ఉన్నాయి. సూయజ్ కాల్వ ద్వారా ప్రపంచ వాణిజ్యంలో ఏటా సుమారు 12 శాతం వ్యాపారం ఈ కెనాల్ ద్వారానే సాగుతుంది. 8 శాతం సహజ వాయువు ఈ కాలువ ద్వారా వివిధ దేశాలకు రవాణా అవుతుంది.

Suez 6

Suez 6


ఇరుక్కుపోయిన నౌకలో అతి పెద్ద కంటైనర్లు, 20వేల వంద స్టీల్ బాక్సులు, అతి పెద్ద ఈఫిల్ టవర్ అంతటి పరికరాలు మొత్తం మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్స్ అంతటి వైశాల్యం ఉన్న షిప్‌లో ఉండిపోయాయి. ఇంకా దీని కారణంగా వేలలో షిప్ లు అటూ ఇటూ కాకుండా మధ్యలో ఇరుక్కుపోయాయి.

బయల్దేరే రేవు: పోర్ట్‌ సయెద్‌ (మధ్యధరా తీరం వెంబడి ఈశాన్య ఈజిప్టు)
చేరుకునే రేవు: పోర్ట్‌ ట్యూఫిక్‌ (ఎర్ర సముద్రపు పాయను ఆనుకుని ఈశాన్య ఈజిప్టు)
కాలువ నిర్మాణం ప్రారంభించిన తేది: 25 సెప్టెంబర్ 1859
కాలువ నిర్మాణం పూర్తి అయిన తేది: 17 నవంబర్ 1869
మొత్తం నిర్మాణానికి పట్టిన సమయం: 10 సంవత్సరాల 53 రోజులు
నిర్వహణ: ఈజిప్టుకు చెందిన సూయజ్ కెనాల్ అథారిటీ (ఎస్సీఏ)
కెనాల్‌ ఉపయోగం: ఆసియా, ఐరోపాల మధ్య షిప్పింగ్‌కి దగ్గరి దారి
77.5 మీటర్ల వెడల్పు (254 అడుగులు, 3 అంగుళాలు) ఉన్న భారీ నౌకలు ప్రయాణించడానికి వీలు
నౌక ప్రయాణ సమయం: వేగాన్ని బట్టి 11 నుంచి 18 గంటలు
నౌక ప్రయాణ వేగం: గంటలకు 15 కి.మీ. (8 నాటికల్‌ కి.మీ)
గతేడాది ఈ మార్గంలో ప్రయాణించిన మొత్తం నౌకలు: 19,000
రోజుకు సగటున 51 కంటే ఎక్కువ నౌకలు ప్రయాణం చేస్తాయి.
సూయజ్‌ కెనాల్‌ అథారిటీ లెక్కల ప్రకారం.. ఈ మార్గంలో ప్రయాణించినందుకు నౌకల నుంచి వసూలు చేసిన టోలు గతేడాది 6 బిలియన్‌ డాలర్లు (రూ.43.5 వేల కోట్లు)