Vladimir Putin: రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ను తొలగిస్తారంటున్న యుక్రెయిన్.. క్రిమియాను స్వాధీనం చేసుకుంటామని ప్రకటన

త్వరలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పదవి నుంచి తొలగించబోతున్నట్లు యుక్రెయిన్ ప్రకటించింది. ఈ మేరకు రష్యాలో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది.

Vladimir Putin: రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ను తొలగిస్తారంటున్న యుక్రెయిన్.. క్రిమియాను స్వాధీనం చేసుకుంటామని ప్రకటన

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పదవి నుంచి దించేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఔనని చెబుతోంది యుక్రెయిన్. ఈ మేరకు ఈ అంశంపై రష్యాలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు యుక్రెయిన్ రక్షణశాఖ ప్రతినిధి కిరిలో బుడానోవ్ వెల్లడించారు.

Cable Bridge: ఘోరం.. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 60 మంది మృతి.. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడారు. పుతిన్‌ను త్వరలోనే అధ్యక్ష పదవి నుంచి తొలగించబోతున్నట్లు చెప్పారు. ‘‘యుక్రెయిన్ యుద్ధం ముగిసేలోపే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే అవకాశాలున్నాయి. దీనిపై రష్యా అధికారులు తీవ్రంగా చర్చిస్తున్నారు. పుతిన్ పదవిలో కొనసాగే అవకాశాలు చాలా తక్కువ. పుతిన్ తర్వాత అధ్యక్ష పదవిలో ఎవరిని కొనసాగించాలి అనే అంశంపై కూడా అక్కడ చర్చ జరుగుతోంది’’ అని కిరిలో బుడానోవ్ తెలిపారు. మరోవైపు రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్‌లోని కీలక ప్రాంతాల్ని రష్యా స్వాధీనం చేసుకుంది.

India vs South Africa: ఇండియాపై దక్షిణాఫ్రికా విజయం.. మూడో టీ20లో పోరాడి ఓడిన భారత్

అయితే, ఆ ప్రాంతాల్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు యుక్రెయిన్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఖేర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే నెల చివరికల్లా ఆ నగరం తమ ఆధీనంలోకి వస్తుందని యుక్రెయిన్ విశ్వసిస్తోంది. అలాగే రష్యా ఆక్రమించుకున్న క్రిమియాను కూడా తిరిగి తెచ్చుకుంటామని చెబుతోంది.