Israeli hack-for-hire: ప్రతిపక్షాలు, జర్నలిస్ట్‌లు టార్గెట్‌గా ఉగ్రవాదులపై కన్నేసే స్పైవేర్

హ్యాకర్-ఫర్-హైర్ సంస్థలో తయారైన సాఫ్ట్‌వేర్‌ను కొన్ని దేశాలు ప్రతిపక్షాలు, పత్రికా సంస్థలు, ఉగ్రవాదులు, మానవ హక్కులు మరియు పత్రికా స్వేచ్ఛా కార్యకర్తలపై ప్రయోగిస్తున్నాయా?

Israeli hack-for-hire: ప్రతిపక్షాలు, జర్నలిస్ట్‌లు టార్గెట్‌గా ఉగ్రవాదులపై కన్నేసే స్పైవేర్

Nso

Target list of Israeli hack-for-hire firm widens: హ్యాకర్-ఫర్-హైర్ సంస్థలో తయారైన సాఫ్ట్‌వేర్‌ను కొన్ని దేశాలు ప్రతిపక్షాలు, పత్రికా సంస్థలు, ఉగ్రవాదులు, మానవ హక్కులు మరియు పత్రికా స్వేచ్ఛా కార్యకర్తలపై ప్రయోగిస్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఓ ఎన్‌ఎస్ఓ ఇచ్చిన డేటా ప్రకారం.. నేరగాళ్ల పనిపట్టేందుకు తయారైన సాఫ్ట్‌వేర్‌‌ సాయంతో హక్కుల కోసం పోరాడేవారిపై నిఘా పెడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నేరస్తుల, ఉగ్రవాదులపై కన్నేసి ఉంచేందుకు ఉపయోగించే భయంకరమైన స్పైవేర్‌‌ను ప్రపంచవ్యాప్తంగా, భారత్‌తో సహా అనేక దేశాలు ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తల కార్యకలాపాలను చూసేందుకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ మిచెల్ బాచెలెట్ ఒక ప్రకటనలో ఈ సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఎర్రటి గీతను దాటుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. పెగాసస్ అనే సాఫ్ట్‌వేర్ వినియోగించి ఈ రకమైన పనులకు పాల్పడినట్లుగా కూడా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్ పెగాసస్.. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి రహస్యంగా సమాచారం సేకరించేందుకు ఈ పెగాసస్ పనికొస్తుంది. ఈ మాల్‌వేర్‌ లేదా స్పైవేర్‌ ఏదైనా ఫోన్‌లోకి చొరబడితే, స్మార్ట్‌ఫోన్‌లోని మైక్రోఫోన్, కెమెరా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ మెయిల్స్, డేటా, లొకేషన్ అన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఈ స్పైవేర్‌తో ఉంది. ఎన్‌క్రిప్టెడ్‌ అంటే, చాలా రహస్యమైన డేటాను కూడా వినే, చూసే అవకాశం ఈ స్పైవేర్‌కు ఉంది.

ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే సాధారణంగా ఈ స్పైవేర్‌ను ఎన్‌ఎస్‌వో గ్రూపు అమ్ముతుంది. 2010లో ఏర్పాటైన ఈ గ్రూపు ద్వారా ఉగ్రవాదం, నేరాల నిరోధాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయవచ్చు. 2017లో దుబాయ్‌ మానవహక్కుల కార్యకర్త అహ్మద్‌ మన్సూర్‌ తొలిసారి ఈ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించారు.

అప్పట్లో ఆయన స్మార్ట్‌ఫోన్‌ కూడా ఈ స్పైవేర్ బారిన పడగా.. కొన్ని విషయాలు వెలుగులోకి రాగా.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎస్‌ఎంఎస్‌లు వస్తుండటంతో అతడు తన ఫోన్‌ను సైబర్‌ సెక్యురిటీ సంస్థ సిటిజన్‌ ల్యాబ్‌లో చెక్‌ చేయించాడు. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ చేరిందనే విషయాన్ని గుర్తించడం చాలా కష్టంగా అవుతుందని చెబుతున్నారు.