Telangana Dalit Man: గల్ఫ్‌లో 20ఏళ్ల పాటు ఖైదుగా ఉంటూ సాయమందక తెలంగాణ దళితుడి మృతి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి గల్ఫ్ జైలులో 20ఏళ్లుగా శిక్షను అనుభవిస్తూ కనుమూశాడు. మృతదేహాన్ని అప్పగించడానికి కుటుంబ సభ్యుల కోసం వెదుకుతున్నారు అధికారులు.

Telangana Dalit Man: గల్ఫ్‌లో 20ఏళ్ల పాటు ఖైదుగా ఉంటూ సాయమందక తెలంగాణ దళితుడి మృతి

Dalit Man In Telangana

Telangana Dalit Man: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి గల్ఫ్ జైలులో 20ఏళ్లుగా శిక్షను అనుభవిస్తూ కనుమూశాడు. మృతదేహాన్ని అప్పగించడానికి కుటుంబ సభ్యుల కోసం వెదుకుతున్నారు అధికారులు.

దరూరి బుచ్చన్న అనే వ్యక్తి 19ఏళ్ల వయస్సులో యునైటెబ్ అరబ్ ఎమిరేట్స్ కు వచ్చాడు. 20ఏళ్ల క్రితం ఓ విషయంలో నేరం రుజువు కావడంతో జైలు శిక్ష అనుభవిస్తూ వచ్చాడు.

జగిత్యాల జిల్లాలోని రైకల్ మండలానికి చెందిన వ్యక్తిని.. 2001 నుంచి షార్జాలోని జైలులో ఖైదుగా ఉంచారు. అతణ్ని విడుదల చేయాలంటూ కుటుంబం, కమ్యూనిటీ పోరాడింది. అలా చేసేందుకు డబ్బు చెల్లించడానికి లేదంటే సత్ప్రవర్తన వంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఎట్టకేలకు రూ.3లక్షలు చెల్లిస్తే వదిలేస్తామని చెప్పినా ఆ కుటుంబ ఆర్థిక స్థితి ప్రకారం.. డబ్బును ఏర్పాటు చేసేంత ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేకుండాపోయింది. బ్యాచ్ లర్ అయిన బుచ్చన్న తల్లి వృద్ధురాలు కావడం, ఇద్దరు తోబుట్టువులు వేరే వృత్తుల్లో ఉండిపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు.

……………………………………: రొనాల్డోకు మంచి జరిగితే నాకూ ఓకే – డేవిడ్ వార్నర్

జైలులో ఉన్నంతకాలం డిప్రెసివ్ డిజార్డర్, సైకోటిక్ సఫరింగ్, అనేక ఆరోగ్య సమస్యలు దాడి చేయడంతో వీల్ చైర్ కే పరిమితమయ్యాడు. జైలు గోడలకు, పచ్చని పొలాలకు మధ్య తేడాను కూడా గుర్తించలేని దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు.

అతని కోసం 20ఏళ్గుా ఒక్క ఫోన్ కానీ, కలిసి మాట్లాడే వ్యక్తులుగానీ లేరు. ఆరోగ్యం మందగించడంతో షార్జా జైలు అధికారులు హాస్పిటల్ కు పంపించారు. ప్రాణాలతో పోరాడి ఎట్టకేలకు మరణించాడని జైలు అధికారులు ఇండియన్ కాన్సులేట్ కు సమాచారం ఇచ్చారు.